NTR Bharosa Pension: ఏపీ పింఛన్‌దారులకు అలర్ట్.. అక్టోబర్ పంపిణీ వేళల్లో మార్పులు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల(NTR Bharosa Pension) పంపిణీకి సంబంధించి అక్టోబర్ నెలకుగాను కీలకమైన మార్పు చోటుచేసుకుంది.

AP Government changes timings for October month NTR Bharosa pension distribution.

NTR Bharosa Pension: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి సంబంధించి అక్టోబర్ నెలకుగాను ఒక కీలకమైన మార్పు చోటుచేసుకుంది. సాధారణంగా ప్రతి నెలా మొదటి తేదీ ఉదయం సూర్యోదయంతోనే లబ్ధిదారుల ఇళ్ల వద్ద పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుంది. కానీ, ఈసారి అక్టోబర్ 1వ తేదీన ఉదయం పూట కాకుండా మధ్యాహ్నం నుంచి మాత్రమే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పింఛన్ల నగదును అందజేస్తారని అధికారులు స్పష్టం చేశారు. బ్యాంకింగ్ లావాదేవీల సర్దుబాటు దృష్ట్యా ఈ మార్పు చేసినట్లు తెలిపారు.

Naveen Nischal: హిందూపురంలో వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి మాజీ ఇన్‌చార్జ్ నవీన్ నిశ్చల్ రాజీనామా

పింఛన్ల ఆలస్యానికి బ్యాంకుల సమ్మె ప్రభావం – ప్రత్యామ్నాయ ఏర్పాట్లు:

ఈ నిర్ణయానికి ప్రధాన కారణం బ్యాంకు ఉద్యోగుల సమ్మె. ఈ నెల 28, 29, 30 తేదీలలో వివిధ డిమాండ్ల సాధనకై బ్యాంకు సిబ్బంది సమ్మె చేపడుతుండటంతో ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలతో పాటు పింఛన్ల నిధుల సమకూర్పుపై ప్రభావం పడింది. దీంతో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం పకడ్బందీ ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసింది. సాంకేతిక లోపాలు, నగదు కొరత తలెత్తకుండా సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

అక్టోబర్ 1న ఉదయం నగదు విత్‌డ్రా – మధ్యాహ్నం నుంచి పంపిణీ షురూ:

నూతన ప్రణాళిక ప్రకారం సచివాలయ ఉద్యోగులు అక్టోబర్ 1వ తేదీ ఉదయం సంబంధిత బ్యాంకులకు వెళ్లి పింఛన్ల(NTR Bharosa Pension)కు సంబంధించిన నగదు నిధులను డ్రా చేస్తారు. నగదు సేకరణ పూర్తయిన వెంటనే, అదే రోజు మధ్యాహ్నం నుంచి క్షేత్రస్థాయిలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల ఇళ్లకు వెళ్లి నగదును పంపిణీ చేస్తారు. ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయనున్నందున లబ్ధిదారులు ఈ సమయ మార్పును గమనించి అధికారులకు సహకరించాలని ప్రభుత్వం కోరింది.