AP Government : ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి మించి ఏపీ ప్రభుత్వ రుణాలు : కేంద్రం
రుణాల సేకరణ విషయంలో ఏపీ సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎఫ్‌ఆర్‌బీఎం కన్నా తక్కువ రుణాలు తీసుకోవాలని ఆదేశించింది.
- bheemraj
- Published On : December 21, 2021 / 07:16 AM IST
Ap Govt
AP government debt collection : ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి మించి ఏపీ ప్రభుత్వం 17 వేల 924 కోట్ల రూపాయల రుణాలు సేకరించింది. దీంతో రుణాల సేకరణ విషయంలో ఏపీ సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎఫ్‌ఆర్‌బీఎం కన్నా తక్కువ రుణాలు తీసుకోవాలని ఆదేశించింది.
అధికంగా తీసుకున్న రుణాలను మూడేళ్లలో సర్దుబాటుకు అవకాశం ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. లోక్‌సభలో ఎంపీలు కేశినేని నాని, రఘురామ కృష్ణంరాజు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు.
