AP Government: పండుగవేళ ప్రజలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. రూ.35కే కిలో ఉల్లి.. నేటినుంచే అందుబాటులోకి!

ఆంధ్రప్రదేశ్‌లోని రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిపాయలను రూ.35కే అందుబాటులోకి తెస్తూ పౌర సరఫరాల శాఖ(AP Government) నిర్ణయం తీసుకుంది.

Ap government distributes subsidized onion for 35 rs per kg in rythu bazaars

AP Government: దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యుడిపై ఆర్థిక భారం పడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. పండుగ వేళ ఇంటి ఖర్చులను తగ్గించి, నిరుపేదలకు సాయపడటమే లక్ష్యంగా రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరలకే నిత్యావసరాలను అందించేందుకు శ్రీకారం చుట్టింది. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లిపాయల ధర రూ.60 నుంచి రూ.70 వరకు పలకడంతో పౌర సరఫరాల శాఖ(AP Government) రంగంలోకి దిగి కిలో రూ.35లకే పంపిణీ చేయనుంది.

Kuppam-Srikakulam Airport: ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్.. రాష్ట్రంలో మరోరెండు ఎయిర్‌పోర్టులకు గ్రీన్ సిగ్నల్.. ఏకంగా రూ.1,890 కోట్లతో!

నాసిక్ నుంచి 800 టన్నుల ఉల్లి దిగుమతి.. రైతు బజార్లలో అందుబాటులోకి:

ప్రజలకు రాయితీ ధరకే నాణ్యమైన ఉల్లిని అందించడం కోసం మహారాష్ట్రలోని నాసిక్ నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా ఏకంగా 800 టన్నుల ఉల్లిపాయలను ఏపీ ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్లకు వీటిని ఇప్పటికే చేరవేశామని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని పౌర సరఫరాల కమిషనర్ కన్నబాబు వెల్లడించారు. రైతు బజార్లలో సరిపడా నిల్వలను సిద్ధం చేసి, వినియోగదారులకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు చేపట్టారు.

రాయితీ ధరలకే సన్నబియ్యం.. ఆధార్‌తో ధరణి బ్రాండ్ బియ్యం పంపిణీ:

ఎల్‌నినో ప్రభావంతో దేశంలో బియ్యం ధరలు అమాంతం పెరగడంతో ప్రభుత్వం సబ్సిడీ ధరలకు సన్నబియ్యాన్ని అందిస్తోంది. రైతు బజార్లు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ కౌంటర్లలో ఆధార్ కార్డు చూపించి 26 కేజీల ధరణి బస్తాను రూ.1300కే పొందే వెసులుబాటు కల్పించారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో రూ.49-52కే ఇస్తుండగా, రేషన్ షాపుల్లోనూ పామాయిల్, గోధుమపిండి, పంచదార వంటి సరుకులను తక్కువ ధరలకు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.