Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వరుసగా 4 రోజులు సెలవులు.. అధికారిక ఉత్తర్వులు జారీ
దసరా పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు వరుస సెలవులు(Holidays) లభించడంతో పండుగ ఉత్సాహం రెట్టింపైంది.
- V Santhosh Kumar
- Published on- October 17, 2026 / 11:08 AM IST
Ap government employees 4 days holidays dussehra mahanavami
Holidays: దసరా పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు వరుస సెలవులు లభించడంతో పండుగ ఉత్సాహం రెట్టింపైంది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం చేసిన విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం, అక్టోబర్ 19వ తేదీ సోమవారం (మహర్నవమి) నాడు సాధారణ సెలవు దినంగా ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) జి. సాయిప్రసాద్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల ఉద్యోగులకు దసరా పండుగను కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా జరుపుకునే అవకాశం దక్కింది.
ఆ రోజున వర్కింగ్ డే.. సచివాలయ, హెచ్వోడీ ఉద్యోగులకు 3 నుంచి 4 రోజుల హాలిడేస్:
అక్టోబర్ 19న అదనంగా ఇచ్చిన సెలవుకు బదులుగా నవంబర్ 14వ తేదీన వచ్చే రెండో శనివారాన్ని పని దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో సచివాలయం, హెచ్వోడీ (HOD) స్థాయి సిబ్బందికి శనివారం నుంచి మంగళవారం వరకు వరుసగా 4 రోజులు, జిల్లా స్థాయి ఉద్యోగులకు ఆదివారం నుంచి 3 రోజులు సెలవులు లభించాయి. అయితే రాబోయే ఎన్నికల విధులు, అత్యవసర సేవల బాధ్యతల్లో ఉన్న అధికారులు మాత్రం యథావిధిగా విధులకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
దసరా సెలవుల షెడ్యూల్.. తెలుగు రాష్ట్రాల్లో బడులు, కాలేజీల రీఓపెనింగ్ తేదీలు ఇవే:
పాఠశాలలు, కళాశాలల దసరా సెలవుల(Holidays) విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచే సెలవులు ప్రారంభంకాగా, ఈ నెల 22న తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇక తెలంగాణలో జూనియర్ కళాశాలలు అక్టోబర్ 22న, పాఠశాలలు అక్టోబర్ 23న, అలాగే డిగ్రీ కళాశాలలు అక్టోబర్ 26న పునఃప్రారంభం కానున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు కూడా అక్టోబర్ 21 వరకు సెలవులు వర్తిస్తాయి. ఈ పండుగ శ సెలవుల వల్ల రెండు రాష్ట్రాల ప్రజలు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు.
