AP Govt Employees: సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్.. అధికారిక జీవో జారీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ, వార్డు వ్యవస్థలో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగులకు (AP Govt Employees)రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.

AP government gives green signal for the promotion of Secretariat employees.

AP Govt Employees: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ, వార్డు వ్యవస్థలో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వారి పదోన్నతులకు సంబంధించిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన అనంతరం, పదోన్నతి ఛానెల్స్‌పై అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. పురపాలక ఉద్యోగులు అందిస్తున్న సేవలకు తగిన గుర్తింపు ఇవ్వడంతో పాటు, పట్టణ ప్రాంతాల్లో ప్రజా సేవలను మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Telangana Bar License: తెలంగాణలో కొత్తగా 41 బార్ లైసెన్సులు.. అధికారిక నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు ఫీజు, లాస్ట్ డేట్ వివరాలు!

815 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ఆమోదం – 1630 పోస్టులు గ్రేడ్-I కి అప్‌గ్రేడ్:

ఈ నూతన ఉత్తర్వుల ప్రకారం వార్డుల్లో మిగిలి ఉన్న ఖాళీలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం(AP Govt Employees) కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అనుమతి ఇచ్చింది. ఈ పోస్టుల్లో అర్హత కలిగిన వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు పదోన్నతులు కల్పిస్తారు. అలాగే ఖాళీ అయ్యే అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలతో భర్తీ చేస్తారు. మరోవైపు, వార్డు శానిటేషన్, ప్లానింగ్ సెక్రటరీ క్యాడర్లలోని 815 పోస్టులను గ్రేడ్-II నుంచి గ్రేడ్-I కి అప్‌గ్రేడ్ చేయడం వల్ల మొత్తం 1630 మందికి ప్రమోషన్లు లభిస్తాయి.

త్వరలోనే మిగిలిన కేటగిరీల నిబంధనలు – మంత్రి నారాయణ కీలక వెల్లడి:

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఈ ప్రమోషన్ల నిర్ణయం వార్డు సచివాలయాల నిర్వహణను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. అధికారుల కమిటీ నుంచి సిఫార్సులు అందిన వెంటనే, మిగిలిన మరో రెండు కేటగిరీల ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.