Thalliki Vandanam Funds Released: ఏపీ విద్యార్థుల తల్లులకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ నిధులు విడుదల.. డైరెక్ట్ అకౌంట్లోకి రూ.13000

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం(Thalliki Vandanam Funds Released)' పథకానికి సంబంధించి విద్యార్థుల తల్లులకు బిగ్ అప్‌డేట్ లభించింది.

AP government has finalized the list of second phase of the 'Thalliki Vandanam' scheme.

Thalliki Vandanam Funds Released: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం(Thalliki Vandanam Funds Released)’ పథకానికి సంబంధించి విద్యార్థుల తల్లులకు బిగ్ అప్‌డేట్ లభించింది. మొదటి విడతలో సాంకేతిక కారణాలు, నమోదు సమస్యల వల్ల లబ్ధిందని వారికి అర్హత కల్పించే ప్రక్రియను ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తి చేసింది. దరఖాస్తుల పునఃపరిశీలన, ఫిర్యాదుల పరిష్కారం అనంతరం తాజాగా రెండో దశ అర్హుల జాబితాను అధికారులు అధికారికంగా ఖరారు చేశారు.

Rain Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్: రాబోయే 3 రోజులు వర్షాలు.. 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు.. IMD కీలక బులెటిన్ విడుదల!

3.29 లక్షల మందికి కొత్తగా లబ్ధి.. భారీగా బడ్జెట్ కేటాయింపులు:

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 3,29,201 మంది తల్లులు, విద్యార్థులను రెండో విడత కింద అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఈ పథకం అమలు కోసం రూ.10,208.69 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో (ఉత్తర్వులు) జారీ చేసింది. కొత్తగా చేరిన లబ్ధిదారులతో కలిపి రాష్ట్రంలో ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న మొత్తం విద్యార్థుల సంఖ్య దాదాపు 68 లక్షలకు చేరింది.

నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు.. చెల్లింపులకు మార్గం సుగమం:

ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల చదువులకు ఆర్థిక భరోసా ఇవ్వడమే లక్ష్యంగా ఈ పథకం సాగుతోంది. ప్రతీ విద్యార్థికి ఏటా కేటాయించే రూ.15,000 ఆర్థిక సాయంలో, మౌలిక వసతుల నిర్వహణ నిమిత్తం రూ.2,000 మినహాయించి మిగిలిన రూ.13,000 నగదును నేరుగా లబ్ధిదారులైన తల్లుల బ్యాంక్ ఖాతాల్లో (DBT) వేసేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ముఖ్యమంత్రి బటన్ నొక్కి ఈ నిధులను ఖాతాల్లో జమ చేయనున్నారు.