AP News : ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. కొత్త వాహనం కొనుగోలు చేస్తున్నారా..? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి.. 24గంటలే సమయం..!

AP News : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా వాహన రిజిస్ట్రేషన్ల విషయంలో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.

new vehicle Registration

  • ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
  • ఏపీలో 24గంటల్లోపే వాహనాల రిజిస్ట్రేషన్
  • త్వరలోనే నూతన విధానం అమల్లోకి

AP News : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా వాహన రిజిస్ట్రేషన్ల విషయంలో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. దీంతో రాబోయే రోజుల్లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 24గంటల్లోనే పూర్తికానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 27వేల వాహనాలు శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ అధికారుల వద్ద పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. నిర్ణీత గడువు లేకపోవటమే దీనికి కారణమని భావించిన సీఎం చంద్రబాబు నాయుడు.. వాహనాల రిజిస్ట్రేషన్లు వేగంగా జరిగేందుకు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కొత్త విధానాన్ని త్వరలో అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.

Also Read : IPL 2026 : బాబోయ్.. కోహ్లీకే దిమ్మతిరిగే షాకిచ్చిన యువ బౌలర్.. సర్రుమంటూ దూసుకొచ్చింది.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!

కొత్త వాహనం కొనుగోలు చేసిన తరువాత వాహన రిజిస్ట్రేషన్ల విషయంలో ఎలాంటి జాప్యాలు లేకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీంతో రవాణా శాఖ ఇప్పుడు కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. నూతన విధానానికి సంబంధించిన పత్రాలు రవాణాశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. అక్కడ ఆమోదం లభించగానే వెంటనే అమల్లోకి రానుంది. వారం రోజుల్లోనే కొత్త విధానానికి ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చే అవకాశం ఉంది.

వాస్తవానికి రాష్ట్రంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కాస్త ఆలస్యంగా జరుగుతోంది. ప్రస్తుత ప్రక్రియ ప్రకారం.. వాహనానికి డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేశాక దీనికి రవాణా శాఖ అధికారులు ఆమోదం తెలిపి.. శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఇదే విషయంపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తో పాటు శాశ్వత రిజిస్ట్రేషన్ అధికారాన్ని వాహన డీలర్‌కే అప్పగించే అంశాన్ని పరిశీలించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. అయితే. ఈ విధానం వల్ల న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని, రవాణా శాఖ వద్దే రిజిస్ట్రేషన్ అధికారం ఉండాలని అధికారులు సూచించారు. దీంతో 24గంటల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే విధానం అమలుకు నిర్ణయించారు.

కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నూతన విధానం అమల్లోకి వస్తే.. రవాణా శాఖ అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కచ్చితంగా 24గంటల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. డీలర్ వాహనానికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేశాక.. ఫ్యాన్సీ నంబరు కోరుకునే వాహనాలకు మినహా మిగిలిన వాటికి ఆన్‌లైన్ అప్లికేషన్లను అధికారులు పరిశీలించి.. 24గంటలలోపు ఆమోదించాల్సి ఉంటుంది. శాశ్వత రిజిస్ట్రేషన్, నంబరు జనరేట్ చేసే ప్రక్రియ 24గంటల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రవాణా శాఖ అధికారులు జాప్యం చేసినా.. 24గంటల తరువాత ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్‌కు ఆమోదం లభిస్తుంది. సెలవు రోజు‌కూడా ఆన్‌లైన్‌లో అధికారులు ఆమోదం తెలపొచ్చని రవాణాశాఖ వర్గాలు తెలిపాయి.