Cm Chandrababu: అన్నంత పని చేసిన చంద్రబాబు..! పిఠాపురం నుంచే ఆపరేషన్ స్టార్ట్..! తమ్ముళ్లకు ఓ హెచ్చరికనా?
ఏకంగా పార్టీకి లాయలిస్ట్‌గా, సిన్సియర్ కార్యకర్తగా పేరున్న వర్మను పిఠాపురం ఇంచార్జ్ పదవి నుంచి తప్పించి షాక్ ఇచ్చారు చంద్రబాబు.
Cm Chandrababu: కూటమి లాంగ్ లీవ్. ఇదే బాటమ్ లైన్. ఫిక్స్ అయిపోండి. పొత్తు ముఖ్యం. కూటమిగానే ఉండటమే టాప్ ప్రయారిటీ. ఒక్కరిద్దరి కోసం..కొందరు నేతల ఇగో కోసం పార్టీ పని చేయదు. ఎన్నోసార్లు హెచ్చరించాం. అలర్ట్ చేశాం. కూటమి ఇంపార్టెన్స్ ఏంటో కూడా చెప్పామ్. అయినా పొగ పెడుతామంటే కుదరదు అంటూ క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చేశారు సీఎం చంద్రబాబు. ఏకంగా పవన్ కోసం టికెట్ త్యాగం చేసి..సిన్సియర్ కార్యకర్తగా పేరున్న వర్మను..పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ పోస్ట్ నుంచి తప్పించి షాక్ ఇచ్చారు. బాబు డెసిషన్..అందరికీ ఇండికేషనా.? వేటు వర్మపై అయినా..తమ్ముళ్లకు సెగ తాకేలా చేశారా.?
పర్సనల్ ఎజెండాలు వద్దు. మీ అభిప్రాయాలు పార్టీ మీద నెట్టొద్దు. కూటమి ముఖ్యం. పార్టీకే ప్రాధాన్యం. ఇది అర్థం చేసుకుంటే బెటర్. లేకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఇక మీ ఇష్టమంటూ లీడర్లకు, క్యాడర్‌కు ఎన్నోసార్లు క్లియర్ కట్ ఇండికేషన్ ఇస్తూ వచ్చారు సీఎం చంద్రబాబు. పై స్థాయిలో పవన్‌తో తనకు మంచి రిలేషన్ ఉంది..కలిసే ఉంటాం..కలిసే నడుస్తాం ఫిక్స్ అయిపోండని కూడా చెప్పేశారు. ఎక్కడా ఎలాంటి తేడాలు రావడానికి వీళ్లేదని పలుసార్లు హెచ్చరించారు కూడా. కొందరు నేతల తీరుతో కూటమి డిస్ట్రబ్ అయ్యే పరిస్థితి వస్తే ఊరుకునేది లేదని చెప్పిన చంద్రబాబు..అన్నంత పని చేశారు.
ఫెక్సీలో ఫోటో కోసం గొడవేంటి అంటూ వార్నింగ్..
ఏకంగా పార్టీకి లాయలిస్ట్‌గా, సిన్సియర్ కార్యకర్తగా పేరున్న వర్మను పిఠాపురం ఇంచార్జ్ పదవి నుంచి తప్పించి షాక్ ఇచ్చారు చంద్రబాబు. ఆల్రెడీ పార్టీ కార్యవర్గ సభ్యుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి చర్చకు దారితీశారు. ఫ్లెక్సీలు, ఫెక్సీలో ఫోటో కోసం గొడవేంటి అంటూ ఇండైరెక్ట్ గా వర్మకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా ఆయన్ను పార్టీ ఇంచార్జ్ పదవి నుంచి తొలగించారు. అయితే తనను పిఠాపురం బాధ్యతల నుంచి తప్పించడంపై స్పందించిన వర్మ..పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
SVSN వర్మ. ఫక్తు టీడీపీ కార్యకర్త. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా..పవర్లో ఉన్నా..వర్మది వన్ లైన్ ఎజెండా..పార్టీ కోసం పని చేయడమే. అయితే గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా పిఠాపురం సీటును జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు ఇచ్చారు. అప్పుడే వర్మ తన అసంతృప్తిని వ్యక్తం చేయడంతో..చంద్రబాబుతో సహా లోకేశ్ సర్దిచెప్పి భవిష్యత్‌పై భరోసా ఇచ్చారు. ఫ్యూచర్లో ఎమ్మెల్సీ లేకపోతే మరేదైనా ఆ స్థాయి కార్పొరేషన్ ఛైర్మన్ పోస్ట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే అధిష్టానం మాటకు కట్టుబడి పవన్ కోసం ప్రచారం చేశారు వర్మ. ఆయన ఫ్యామిలీ కూడా పవన్ గెలుపు కోసం హార్ట్ ఫుల్‌గా క్యాంపెయిన్ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక వర్మకు ఏదో ఒక పదవి ఇస్తారన్న టాక్ నడిచింది. మధ్యలో ఇద్దరు గన్మెన్లను కూడా ఇచ్చింది ప్రభుత్వం. కానీ ఇప్పటివరకు ఆయనకు ఏ పదవి దక్కలేదు. దీంతో రానురాను వర్మలో అసంతృప్తి బయటపడుతూ వచ్చింది.
కూటమికే చంద్రబాబు ప్రయారిటీ..
తనకు ఏ పదవి దక్కలేదన్న అసంతృప్తితో..ఇంటెన్షన్ వేరు..బరస్ట్ అవుతున్నది అందుకోసం కాదు అన్నట్లుగా ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో ఉంటూ వచ్చారు. పిఠాపురంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో చంద్రబాబు ఫోటోను చిన్నగా వేశారని ఓసారి అధికారులపై సీరియస్ అయ్యారు వర్మ. మరోసారి పిఠాపురం అభివృద్ధి కమిటీ సమావేశంలో ఫ్లెక్సీలో సీఎం ఫోటో లేదంటూ రాద్ధాంతం చేశారు. జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో మాటల యుద్ధం నడిచింది. దీంతో కూటమిలో కుతకుతలతో..పవన్ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతలకు పొసగట్లేదన్న వార్తలు హల్చల్ చేశాయి. ఇక ఇలా చూసుకుంటే పోతే మొదటికే మోసం వస్తుందని భావించిన సీఎం చంద్రబాబు..కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. వర్మ పార్టీ కోసం పని చేసిన సిన్సియర్ కార్యకర్తే అయినా..ప్రస్తుత పరిస్థితుల్లో కూటమికే చంద్రబాబు ప్రయారిటీ ఇస్తున్నారన్నది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది.
అయితే ఒక్క పిఠాపురంలోనే కాదు..రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన నేతల మధ్య పొసగట్లేదు. కొన్ని చోట్ల అయితే టీడీపీ ఎమ్మెల్యేలు టంగ్ స్లిప్ అవుతూ పార్టీకి తలనొప్పులు తెచ్చుపెడుతున్న పరిస్థితి. ఇలా అన్ని గమనించిన చంద్రబాబు..పిఠాపురం నుంచే ఆపరేషన్ స్టార్ట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. వర్మ లాంటి నేతకే షాక్ ఇచ్చారనే ఇండికేషన్ ఒకటి అయితే..పవన్‌కు, కూటమికి చంద్రబాబు ఇస్తున్న ప్రయారిటీ కూడా ఎక్స్పోజ్ చేసినట్లు అయిందన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు పదవి నుంచి తప్పించింది వర్మనే అయినా..ఈ సెగ అందరికీ తాకేలా చేయాలన్నదే బాబు ఆలోచనగా చెప్పుకుంటున్నారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన, బీజేపీ కూడా ఇలాగే సైడ్ ట్రాక్ పడితే ఇంతే స్ట్రిక్ట్‌గా బిహేవ్ చేసేలా బాబు రూట్‌మ్యాప్ వేశారని చర్చించుకుంటున్నారు. ఏదేమైనా పిఠాపురం వర్మ విషయంలో బాబు తీసుకున్న డెసిషన్ అయితే పొలిటికల్ హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: ఏపీలో మరో కొత్త పథకం.. మ్యానిఫెస్టోలో చెప్పకపోయినా అమలు.. వారి వివాహానికి రూ.లక్ష వరకు
