AP NTR Kalyana Lakshmi Scheme : ఏపీలో మరో కొత్త పథకం.. మ్యానిఫెస్టోలో చెప్పకపోయినా అమలు.. వారి వివాహానికి రూ.లక్ష వరకు
AP NTR Kalyana Lakshmi Scheme : ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం మరో కొత్త పథకాన్ని ప్రారంభించబోతుంది. అది కూడా మహిళల కోసం.
ap government to launch ntr kalyana lakshmi scheme to give loan upto rs 1 lakh for self help group women daughters marriage
AP NTR Kalyana Lakshmi Scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మ్యానిఫెస్టోలో చెప్పకపోయినా సరే.. పేదల కోసం సరికొత్త పథకాన్ని ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది. అదే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం. దీని ద్వారా స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాళ్లైన మహిళలకు ఆర్థిక సాయం అందించాలని సర్కార్ యోచిస్తోంది. డ్వాక్రా సంఘాల్లో సభ్యులైన తల్లుల కుమార్తెల వివాహ ఖర్చుల కోసం ఈ పథకం ద్వారా రూ.లక్ష వరకు రుణ సాయం పొందవచ్చు.
* AP సర్కార్ శుభవార్త.. ఇకపై లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పని లేదు.. ఉచితంగా ఆ చికిత్స..
అర్హులైన సభ్యులకు ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారునికి గరిష్టంగా రూ. 1,00,000 (ఒక లక్ష రూపాయలు) వరకు రుణం మంజూరు చేస్తారు. ఈ రుణంపై కేవలం 4 శాతం వార్షిక వడ్డీ, అనగా పావలా వడ్డీ మాత్రమే విధిస్తారు. దీనివల్ల పేద కుటుంబాలు ఆడబిడ్డ వివాహం కోసం బయట అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన అవసరం కొంత మేర తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. లబ్ధిదారులు ఈ రుణాన్ని సులభమైన వాయిదాలలో.. నాలుగు సంవత్సరాల్లో అనగా.. 48 నెలల కాలపరిమితిలో తిరిగి చెల్లించవచ్చు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు 48 గంటల్లోనే రుణ మొత్తం నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకాన్ని స్త్రీ నిధి (Stree Nidhi) బ్యాంక్ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తోంది.
అర్హతలు :
- ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని భావించే మహిళ తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏదైనా డ్వాక్రా (DWCRA) సంఘంలో సభ్యురాలై ఉండాలి.
- సదరు సంఘంలో కనీసం 6 నెలల నుండి అంతకంటే ఎక్కువ కాలం సభ్యురాలిగా కొనసాగుతూ ఉండాలి.
- కుమార్తె పెళ్లి నిశ్చయం అయిన వారు మాత్రమే ఈ రుణానికి అర్హులు.
- గతంలో తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లిస్తున్న వారికి అధిక ప్రాధాన్యత ఉంటుంది.
దరఖాస్తుకు కావలసిన పత్రాలు ఏమిటంటే..
- కుమార్తె, వరుడి ఆధార్ కార్డులు,
- వివాహ లగ్న పత్రిక,
- కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం,
- వయస్సు ధ్రువీకరణ పత్రం (కుమార్తెకు 18 ఏళ్లు నిండాలి),
- డ్వాక్రా సంఘం సభ్యత్వ వివరాలు,
- పాస్బుక్, అలాగే బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.
