×
Ad

AP Govt : ఏపీలోని మహిళలకు భారీ శుభవార్త.. కొత్తగా మరో మూడు పథకాలు.. ఇక వారికి ఆ సమయాల్లో ఇబ్బందులుండవ్..

AP Govt : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి అనే చర్యలు తీసుకుంటుంది. తాజాగా వారికోసం కొత్తగా మూడుపథకాలను ప్రారంభించేందుకు సర్కార్ సిద్ధమైంది.

AP Government

  • ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
  • డ్వాక్రా మహిళల కోసం మూడు కొత్త పథకాలు
  • మహిళా దినోత్సవం రోజు ప్రారంభం

AP Govt : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి అనే చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో కొత్త పథకాలను అమలు చేస్తూ, వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ ఆర్థికంగా బలోపేతం అయ్యేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే, సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా మూడు పథకాలను తీసుకురాబోతున్నారు. వీటిని ఒకే రోజు ప్రారంభించేందుకు నిర్ణయించారు. వీటి ద్వారా మహిళలకు ఎంతో మేలు జరగనుంది.

Also Read : AP Govt : ఏపీలోని రైతులకు భారీ ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న కూటమి సర్కార్.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. రెండు నెలల్లో కంప్లీట్‌గా..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న రాబోతుంది. దీనికితోడు ఏపీలో గ్రామ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ఏర్పాటై 25ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 8వ తేదీన మహిళల కోసం కొత్తగా మూడు పథకాలను ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ విద్యాలక్ష్మీ, ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మీ, యానిమేటర్లకు ఉచిత స్మార్ట్‌ఫోన్లు పథకాలను ప్రారంభిస్తారు.

ఎన్టీఆర్ విద్యాలక్ష్మీ పథకం పిల్లల చదువుల కోసం ఉపయోగపడుతుంది. డ్వాక్రా సంఘాల్లో కనీసం ఆరు నెలలు సభ్యులుగా ఉన్న మహిళలు ఈ పథకంకు అర్హులుగా ఉంటారు. గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు స్కూల్, కాలేజీ ఫీజు, చదువు సంబంధిత ఖర్చుల కోసం ప్రభుత్వం రూ. 10వేల నుంచి రూ.లక్ష వరకు రుణం ఇస్తుంది. దీనికి పావలా వడ్డీనే వర్తిస్తుంది. 48నెలల్లో సులభ వాయిదాల్లో ఈ మొత్తాన్ని చెల్లించొచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న తరువాత అర్హతను బట్టి 48 గంటల్లో స్త్రీనిధి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ అవుతాయి.

ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మీ పథకం కూతురి పెండ్లికి సంబంధించింది. దీనికి కూడా డ్వాక్రా సంఘంలో కనీసం ఆరు నెలల సభ్యత్వం ఉన్నవారు అర్హులు. ఈ పథకం ద్వారా కుమార్తె వివాహం ఖర్చులకు రూ.10వేల నుంచి రూ. లక్ష వరకు రుణం తీసుకోవచ్చు. దరఖాస్తు చేసుకుంటే కుమార్తె పెళ్లికి 48గంటల ముందుగానే డబ్బు అకౌంట్ కు చేరుతుంది. లగ్న పత్రిక, పెళ్లి ఖర్చు అంచనా వ్యయం పత్రాలను సమర్పించాలి. వివాహానికి సంబంధించిన వివరాలు పరిశీలించిన తర్వాత సభ్యురాలి బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తారు. ఈ సొమ్మును కేవలం పావలా వడ్డీతో 48 నెలల్లో సులభ వాయిదాల్లో చెల్లించవచ్చు.

యానిమేటర్లకు ఉచిత స్మార్ట్‌ఫోన్లు పథకం.. డ్వాక్రా సంఘాల నిర్వహణ, రికార్డులు, బుక్ కీపింగ్ సులభం చేయడానికి 27,500 మంది యానిమేటర్లు, 5000 మంది కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లకు రూ.15వేలు విలువైన స్మార్ట్‌ఫోన్లను ఉచితంగా ఇస్తారు. అదనంగా 600 మంది ఏపీఎంలకు ల్యాప్‌టాప్‌లు కూడా ఇస్తారు. ఇలా ఈ మూడు పథకాలను ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం అందుబటులోకి తీసుకొస్తుంది. ఈ పథకాల కోసం ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.2వేల కోట్లు కేటాయించబోతున్నట్లు సమాచారం.