Ap Government: నేతన్నలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ప్రతీ కుటుంబానికి రూ.25000.. రేపే అకౌంట్స్ లో జమ
రాష్ట్రవ్యాప్తంగా రేపే వారి ఖాతాల్లో రూ.25000 జమ చేయనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Ap Government).
- V Santhosh Kumar
- Updated on- August 6, 2026 / 07:24 PM IST
Ap cm chandrababu launches netanna sevalo scheme to provide 25000 financial assistance
- నేతన్న సేవలో పథకం ప్రారంభం
- ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం
- రూ. 179 కోట్లు విడుదల
Ap Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత రంగానికి ఊతమిచ్చేలా మరొక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నేతన్నల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం, తాజాగా ‘నేతన్న సేవలో’ అనే నూతన కార్యక్రమాన్ని పట్టాలెక్కిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ, చేనేత వృత్తిని కాపాడుకోవాలనే ఉన్నతమైన లక్ష్యంతో ప్రతి అర్హత కలిగిన చేనేత కుటుంబానికి రూ. 25,000 చొప్పున నేరుగా ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం(Ap Government) ముందుకు వచ్చింది.
Ap Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఈ 7 జిల్లాలకు హెచ్చరికలు
రూ. 179 కోట్ల నిధులు విడుదల, సీఎం పర్యటన వివరాలు:
ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని చీరాలలో ప్రారంభించనున్నారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 71,536 చేనేత కుటుంబాలకు మొత్తం రూ.179 కోట్ల మేర సాయం అందనుంది. పర్యటనలో భాగంగా సీఎం కొత్తపేటలోని ప్రజావేదిక సభలో పాల్గొనడంతో పాటు, జాండ్రపేటలో నిర్వహించే ప్రత్యేక వర్క్‌షాప్‌లో చేనేత కార్మికులతో నేరుగా ముఖాముఖి సంభాషించనున్నారు.
ఉచిత విద్యుత్, పింఛన్లతో సమగ్ర సంక్షేమం:
ఇప్పటికే చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌లకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ తో పాటు 50 ఏళ్లు దాటిన వారికి రూ.4 వేల పింఛన్ అందిస్తున్నారు. అలాగే ఉప్పాడలో మౌలిక వసతులు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్, విశాఖలో రూ.4,200 కోట్ల టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్ ప్రాజెక్టులు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి.
