Ap Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఈ 7 జిల్లాలకు హెచ్చరికలు
ఏపీపై ఉపరితల ఆవర్తనం తీవ్రమైన ప్రభావం చూపుతుండటంతో శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు (Ap Rain Alert)కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Ap weather update heavy rains and lightning alert issued for seven districts
- ఏపీకి పిడుగులతో వర్షాల హెచ్చరిక
- పలు జిల్లాల్లో మోస్తరు వర్ష సూచన
- విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు హెచ్చరిక
Ap Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఏపీపై ఉపరితల ఆవర్తనం తీవ్రమైన ప్రభావం చూపుతుండటంతో శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ఆవర్తన ప్రభావం వల్ల వాతావరణం ఒక్కసారిగా చల్లబడి, అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం కనిపిస్తోంది.
Retirement Age: ఏపీలోని ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పదవీ విరమణ వయస్సు రెండేళ్లు పెంపు.. జీవో విడుదల
వివిధ జిల్లాల్లో వర్షాల తీవ్రత వివరాలు:
ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడుతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు(Ap Rain Alert) పడే సూచనలు ఉన్నాయి.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు:
వర్షాల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో బయట సంచరించకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని కోరింది. పిడుగులు పడే ముప్పు ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇనుప స్తంభాలు, ప్రకటనల బోర్డుల వద్ద నిలబడకూడదని స్పష్టం చేసింది.
