AP Liquor Policy 2026: ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. 807 మద్యం దుకాణాలకు లాటరీ.. అక్టోబర్ 5న విజేతల ఖరారు!

ఏపీ ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ 2026-27(AP Liquor Policy 2026) అమలును వేగవంతం చేస్తూ మద్యం దుకాణాల కేటాయింపుకు కీలక చర్యలు చేపట్టింది.

Ap government new excise policy liquor shops lottery notification and application process

AP Liquor Policy 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ 2026-27 (AP Liquor Policy 2026)అమలును వేగవంతం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన మద్యం దుకాణాల కేటాయింపుకు కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 3,736 లైసెన్స్ దుకాణాల్లో ఇప్పటికే 2,929 షాపుల రెన్యూవల్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. మిగిలిన 807 మద్యం దుకాణాలను పారదర్శక విధానంలో లాటరీ ద్వారా కేటాయించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసి, సెప్టెంబర్ 24న అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నిర్ణయంతో మద్యం వ్యాపారుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది.

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు ప్రదానం

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు – అక్టోబర్ 5న విజేతల ఖరారు:

మిగిలిన 807 దుకాణాల్లో 799 షాపులను ఓపెన్ కేటగిరీ కింద, 8 దుకాణాలను రిజర్వుడ్ కేటగిరీ కింద కేటాయించనున్నారు. ఆసక్తి గల వ్యాపారులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లేదా హైబ్రిడ్ విధానాల ద్వారా అక్టోబర్ 1 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రతి దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్-రిఫండబుల్ ఫీజుగా నిర్ణయించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అక్టోబర్ 5వ తేదీన లాటరీ నిర్వహించి విజేతలను ఎంపిక చేస్తారు. కొత్త లైసెన్సుదారుల కాలపరిమితి 2026 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉండనుంది.

వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధిక షాపులు – జిల్లాల వారీగా కేటాయింపులు:

జిల్లాల వారీగా పరిశీలిస్తే, అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 60 దుకాణాలకు లాటరీ నిర్వహించనుండగా, అనంతపురం జిల్లాలో 53, విశాఖపట్నంలో 52, నెల్లూరు జిల్లాలో 51 షాపులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ప్రక్రియ మొత్తాన్ని అత్యంత పారదర్శకంగా పూర్తి చేసేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.