Retirement Age: ఏపీలోని ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పదవీ విరమణ వయస్సు రెండేళ్లు పెంపు.. జీవో విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మోడల్ పాఠశాల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు(Retirement Age)ను పెంచుతూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ap government raises model school employees retirement age to 62 years

  • మోడల్ స్కూల్ ఉద్యోగులకు శుభవార్త
  • రిటైర్మెంట్ వయస్సు 62 పెంపు
  • విద్యాశాఖ జీవో అధికారికంగా విడుదల

Retirement Age: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మోడల్ పాఠశాలల్లో సేవలందిస్తున్న ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. వారి సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ పదవీ విరమణ వయస్సును(Retirement Age) పెంచుతూ కూటమి ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకు 60 ఏళ్లుగా ఉన్న రిటైర్మెంట్ పరిమితిని మరో రెండేళ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సర్వీసుల్లోని ఇతర ఉద్యోగులతో సమానంగా వీరికి కూడా 62 ఏళ్ల వరకు ఉద్యోగంలో కొనసాగే వెసులుబాటు లభించడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

AP Cabinet: ముగిసిన ఏపీ క్యాబినెట్.. 34 కీలక అంశాలకు ఆమోదం.. అమరావతి, అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లకు భారీ నిధులు

అధికారికంగా జీవో విడుదల చేసిన విద్యాశాఖ

ఆర్థిక శాఖ జారీ చేసిన జీవోఎంఎస్ నం.45ను అనుసరిస్తూ పాఠశాల విద్యాశాఖ తాజాగా జీవోఎంఎస్ నం.18ను అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మోడల్ స్కూళ్లలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క అర్హులైన ఉద్యోగికీ ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం తక్షణమే అవసరమైన పరిపాలనా పరమైన చర్యలను పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

మరో రెండేళ్లు సేవలు అందించే అవకాశం

ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో ఏపీ మోడల్ స్కూల్స్ సిబ్బందికి ఉద్యోగ భద్రత పెరగడంతో పాటు మరో రెండేళ్ల పాటు విద్యాబోధనలో తమ సేవలను అందించే వెసులుబాటు కలిగింది. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగమే ఈ చర్య అని భావిస్తున్నారు. ఈ నిర్ణయం పట్ల ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశాయి.