Nethannaku Bharosa: నేతన్నలకు శుభవార్త.. త్వరలోనే అకౌంట్లలోకి రూ.25,000
ఆంధ్రప్రదేశ్ చేనేత((Nethannaku Bharosa)) కార్మికులకు రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పారు.
- V Santhosh Kumar
- Updated on- July 7, 2026 / 08:06 AM IST
AP government set to provide 25,000 to handloom weavers under the Nethannaku Bharosa scheme
- నేతన్నకు భరోసా కార్యాచరణ పూర్తి
- త్వరలోనే ఖాతాల్లో రూ.25వేలు జమ
- ఆప్కో బకాయిల విడుదలకు హామీ
Nethannaku Bharosa: ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికులకు రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పారు. ‘నేతన్నకు భరోసా(Nethannaku Bharosa)’ పథకం కింద ప్రభుత్వం ఏటా చేనేత కార్మికులకు అందజేస్తున్న రూ.25,000 ఆర్థిక సాయం పంపిణీకి సంబంధించిన అన్ని రకాల కార్యాచరణ, ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆమె వెల్లడించారు. త్వరలోనే ఈ నిధులను నేరుగా అర్హులైన నేతన్నల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు.
Hyderabad: మాట్లాడుకుందాం అని పిలిచి.. కత్తులతో పొడిచి.. హైదరాబాద్ లో దారుణం
మంగళగిరిలో ఘనంగా నిర్వహించిన ఆప్కో (APCO) గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ కీలక ప్రకటనలు చేశారు. చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆప్కో బకాయిల విడుదలపై కూడా ఆమె సానుకూలంగా స్పందించారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన రూ.4 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని, అలాగే వచ్చే నెల (ఆగస్టు) మొదటి వారంలో మరో రూ.2.5 కోట్ల నిధులను చేనేత సహకార సంఘాలకు చెల్లిస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది చేనేత కార్మికులకు, సహకార సంఘాలకు పెద్ద ఊరట లభించనుంది.
