Amaravati Fire Incidents: అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతిని విధ్వంసం చేసే ఆలోచన ఉన్న వారే ఇలాంటి పనులు చేస్తుండొచ్చని భావిస్తున్నామన్నారు.

  • Published On : March 26, 2026 / 07:41 PM IST

Amaravati Fire Incidents: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరుగుతున్న వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనలపై మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిలో జరుగుతున్న అగ్నిప్రమాదాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని తెలిపారు. 2014లోనూ రాజధాని అమరావతి అంటే ఇష్టం లేని వారు అరటి తోటలను తగులబెట్టారని మంత్రి పార్థసారధి గుర్తు చేశారు. ఇప్పుడు అమరావతిలో జరిగిన 3 అగ్నిప్రమాదాలు ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు అనుమానాలున్నాయన్నారు.

అమరావతిలో వినియోగించే భూగర్భ పైపులు అత్యధిక ఉష్ణోగ్రత వద్దే కాలేందుకు అవకాశాలున్నాయన్నారు. అమరావతి అభివృద్ది చెందకూడదనే ఆలోచన ఉన్న వారు ఇలా తగలబెడుతుండొచ్చని అనుమానం వ్యక్తం చేశారాయన. అమరావతిని విధ్వంసం చేసే ఆలోచన ఉన్న వారే ఇలాంటి పనులు చేస్తుండొచ్చని భావిస్తున్నామన్నారు.

మరోవైపు భవిష్యత్తులో ఎవరూ రాజధానిని మార్చకుండా ఉండేందుకు తీర్మానం చేశామన్నారు మంత్రి పార్థసారధి. దీనిపై రాజ్యాంగబద్దంగా ముందుకెళ్తామన్నారు. అసెంబ్లీలో అమరావతిపై చర్చ పెట్టి తీర్మానించాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.