Mudragada Padmanabham : అధికార లాంఛనాలతో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు.. కుమార్తె క్రాంతిని అడ్డుకున్న అనుచరులు..

Mudragada Padmanabham: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) మంగళవారం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.

AP Government Conducts Mudragada Padmanabhams funeral Rites

Mudragada Padmanabham Funeral Rites : మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన గత నెల 16న హైదరాబాద్ గచ్చిబౌలిలోని యశోధ ఆస్పత్రిలో చేశారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ముద్రగడ మృతికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితోపాటు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ తోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Also Read : ముద్రగడ మరణం తీరని లోటు.. పితృసమానుడిని కోల్పోయాం: వైఎస్ జగన్

అధికారిక లాంఛనాలతో..

ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై బుధవారం ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో చర్చించిన సీఎం చంద్రబాబు నాయుడు ముద్రగడ పద్మనాభంకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముద్రగడ అంత్యక్రియల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గోనున్నారు. ముద్రగడను కడసారి చూసి నివాళులర్పించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో కిర్లంపూడిలోని ఆయన నివాసం వద్దకు తరలివచ్చారు.

కిర్లంపూడిలో ముద్రగడ భౌతికకాయాన్ని చూసేందుకు ఆయన కుమార్తె క్రాంతి రావడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు అడ్డుకున్నారు. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.  తమ నాయకుడి మృతికి నీవే కారణమంటూ గేటు బయట నుంచే ఆమెను పంపేశారు. పోలీసులు బందోబస్తు నడుమ కిర్లంపూడికి వచ్చిన ఆమెను భౌతికకాయం వద్దకు రానీయకపోవడంతో దూరం నుంచే తండ్రిని చివరిచూపు చూసి వెళ్లిపోయారు.