AP Govt : ఏపీలోని ఆ ప్రాంతాల రైతులకు భారీ శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు జమ..
AP government : పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులు అందరి ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం మొత్తం రూ.250 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది.
- Harishth Thanniru
- Published On : March 18, 2026 / 08:20 AM IST
AP government
- ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
- పోలవరం కోసం భూములిచ్చిన రైతుల ఖాతాల్లోకి నగదు
- రూ. 250 కోట్లు జమ చేయనున్న సర్కార్
AP Govt : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతుల ఖాతాల్లో ఇవాళ ప్రభుత్వం రూ.250కోట్లు జమ చేయనుంది.
ఉగాది పర్వదినం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కొంతమంది నిర్వాసితులకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఆ తరువాత పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులు అందరి ఖాతాల్లోకి మొత్తం రూ.250 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది.
పోలవరం ప్రాజెక్టుకోసం భూములిచ్చిన రైతులకు ఇప్పటికే ప్రభుత్వం కొంత డబ్బులు అందజేసింది. గతేడాది సంక్రాంతికి రూ.980 కోట్లు, దీపావళికి రూ.1,000 కోట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. తాజాగా.. రూ.250కోట్లు నిర్వాసిత రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.
ఇదిలాఉంటే.. 2016లో తాము రూ.700 కోట్లు ఇవ్వగా.. వైసీపీ హయాంలో ఒక్క రూపాయీ చెల్లించలేదని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. మళ్లీ తమ ప్రభుత్వం వచ్చిన తరువాత పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరుగుతోందని కూటమి పార్టీల నేతల పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి సర్కార్ రైతుల ప్రభుత్వమని.. రైతులకు ఏ కష్టం వచ్చినా వారికి అండగా ఉంటూ వారి కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కూటమి నేతలు పేర్కొన్నారు.
