Agreed List System: అవినీతి అధికారులపై ఉక్కుపాదం.. అమలులోకి ‘అగ్రీడ్ లిస్ట్’ వ్యవస్థ.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతిని అరికట్టేందుకు గెజిటెడ్ అధికారులకు 'అగ్రీడ్ లిస్ట్(Agreed List System)' వ్యవస్థను అమలు చేస్తూ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Ap government to implement agreed list system for corrupt officers

  • అవినీతి అధికారులపై ఏపీ నిఘా
  • అమల్లోకి ‘అగ్రీడ్ లిస్ట్’ ఉత్తర్వులు
  • కీలక పోస్టింగ్‌లకు ఇక నో

Agreed List System: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనలో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతిని అరికట్టేందుకు గెజిటెడ్ అధికారులకు ‘అగ్రీడ్ లిస్ట్’ వ్యవస్థను అమలు చేస్తూ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అనుమానాస్పద ప్రవర్తన కలిగిన, నిజాయితీపై ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై నిఘా ఉంచేందుకు ఈ ప్రత్యేక విధానాన్ని రూపుదిద్దింది.

Supreme Court: ఇక్కడ పెళ్లి.. విదేశాల్లో విడాకులా? ఎన్ఆర్ఐ భర్తలకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్

ఈ విధానం కింద జీఏడీ, ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సంయుక్తంగా విచారించి బాధ్యతారాహిత్యంగా ఉన్న అధికారుల జాబితాను రూపొందిస్తారు. గుర్తింపు లేని వ్యక్తుల ఫిర్యాదులను పక్కనబెట్టి, కేవలం ఆధారాలు ఉన్న విశ్వసనీయ ఫిర్యాదులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అందిన ప్రతి ఫిర్యాదుపై 90 రోజుల్లోగా పూర్తిస్థాయి విచారణ పూర్తి చేసి తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అగ్రీడ్ లిస్ట్‌(Agreed List System)లో పేరు నమోదైన అధికారులకు భవిష్యత్తులో ఎలాంటి కీలకమైన లేదా లూక్రాటివ్ పోస్టింగ్‌లను కేటాయించరు. అంతేకాకుండా ఈ అధికారుల రోజువారీ నిర్ణయాలు, పనితీరు, జీవనశైలి, ఆస్తులపై విజిలెన్స్ వర్గాలు నిరంతరం రహస్య నిఘా ఉంచుతాయి. ఏడాది పాటు అమల్లో ఉండే ఈ జాబితాను ప్రతి సంవత్సరం సమీక్షించి పునరుద్ధరిస్తారు.