Ap Government: ఏపీ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్.. ఇకనుంచి వాట్సప్‌లోనే ఫిర్యాదులు
కూటమి ప్రభుత్వం(Ap Government) ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘మన మిత్ర’ వాట్సప్ గవర్నెన్స్‌లో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది.
- V Santhosh Kumar
- Published on- June 29, 2026 / 09:02 PM IST
Ap government to introduce voice message complaints through mana mitra whatsapp governance
- మన మిత్ర వాట్సప్ సేవలు.
- వాయిస్ మెసేజ్ ద్వారా ఫిర్యాదులు.
- మెరుగైన మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ.
Ap Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానంతో పౌర సేవలను మరింత సులభతరం చేస్తోంది. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘మన మిత్ర’ వాట్సప్ గవర్నెన్స్‌లో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇకపై ప్రజలు ప్రభుత్వ సేవలపై కార్యాలయాల చుట్టూ తిరగకుండా, నేరుగా వాట్సప్‌లో వాయిస్ మెసేజ్ రూపంలో తమ ఫిర్యాదులను పంపవచ్చు. ఈ మేరకు సరికొత్త వ్యవస్థను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
Bandi Sanjay: వరంగల్ మేయర్ పీఠమే టార్గెట్.. గెలిచి మోదీ గిఫ్ట్ ఇద్దాం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్
గ్రీవెన్స్ సెల్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. సమయం, డబ్బు ఆదా:
సాధారణంగా ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహించే గ్రీవెన్స్ సెల్‌కు (స్పందన) వెళ్లాల్సిన అవసరం లేకుండానే ప్రజలు తమ సమస్యలను వాట్సప్ ద్వారా వివరించవచ్చు. ఈ డిజిటల్ విధానం వల్ల సామాన్యులకు సమయంతో పాటు ప్రయాణ ఖర్చులు కూడా ఆదా అవుతాయి. తాజాగా ఆర్టీజీఎస్ (RTGS) సెంటర్ నుండి నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. వాయిస్ మెసేజ్‌ల ద్వారా వచ్చే సమస్యలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.
మూడు నెలల్లోగా మొబైల్ నెట్‌వర్క్ సమస్యలకు చెక్:
ఈ డిజిటల్ గవర్నెన్స్ సేవలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికీ అందేలా మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీని మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 3,000 ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం(Ap Government), రాబోయే మూడు నెలల్లోగా అక్కడ మెరుగైన సిగ్నల్ కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ సర్టిఫికెట్లు, బిల్లుల చెల్లింపులతో పాటు ఇప్పుడు వాయిస్ మెసేజ్ ఫిర్యాదుల సదుపాయం కూడా తోడవడంతో ‘మన మిత్ర’ వేదికగా పాలన మరింత పారదర్శకంగా మారనుంది.
