Ap Govt Employees: ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రిటైర్ అయిన వారికి మళ్లీ ఉద్యోగాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల(Ap Govt Employees) పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ అధికారికంగా 'జీవో ఎంఎస్ నెం.45' జారీ చేసింది.
- V Santhosh Kumar
- Published on- July 5, 2026 / 06:38 PM IST
ap govt hikes retirement age to 62 and employees reappointment
- రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు
- ఉద్యోగుల వయసు పెంపు జీవో
- తిరిగి విధుల్లోకి చేరే అవకాశం
Ap Govt Employees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ అధికారికంగా ‘జీవో ఎంఎస్ నెం.45’ జారీ చేసింది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ నిర్ణయాన్ని 2022 జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చేలా వర్తింపజేయడం విశేషం. దీనివల్ల గతంలో నెలకొన్న సందిగ్ధతకు పూర్తిగా తెరపడింది.
TTD: 116 ఏళ్ల బామ్మకు వీఐపీ దర్శనం.. ఆదేశాలు జారీ చేసిన టీటీడీ ఛైర్మన్
విధుల్లోకి పునఃప్రవేశం.. నిబంధనలు:
తాజా ఉత్తర్వుల ప్రకారం.. 2022 జనవరి 1 తర్వాత పదవీ విరమణ పొందిన అర్హులైన ఉద్యోగులను(Ap Govt Employees) అవసరమైన చోట్ల తిరిగి విధుల్లోకి తీసుకుంటారు. అయితే, రిటైర్ అయిన తేదీ నుండి తిరిగి చేరినంత వరకు ఉన్న కాలాన్ని ‘అవుట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్’గా పరిగణిస్తూ, ఎలాంటి వేతనం ఇవ్వరు. కానీ, సీనియారిటీ, పదోన్నతులు, నోషనల్ ఇంక్రిమెంట్లకు ఈ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
ఆర్థిక ప్రయోజనాల సర్దుబాటు:
ఇప్పటికే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొంది, తిరిగి చేరాలనుకునే వారు ఆ మొత్తాన్ని సంస్థకు తిరిగి జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తిరిగి చేరడం ఇష్టం లేని వారిని 60 ఏళ్లకే పదవీ విరమణ పొందినట్లుగా గుర్తిస్తారు. సంబంధిత సంస్థలన్నీ తమ సర్వీస్ నిబంధనల్లో తగిన సవరణలు చేసుకుని ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
