AP Junior Doctors: ఏపీ జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం తీపి కబురు.. అధికారిక ఉత్తర్వులు జారీ.. వైద్య విద్యార్థుల సంతోషం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో విధులను నిర్వర్తిస్తున్న జూనియర్ డాక్టర్లకు(AP Junior Doctors) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

ap govt hikes stipend for junior doctors mbbs pg super specialty

AP Junior Doctors: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో విధులను నిర్వర్తిస్తున్న జూనియర్ డాక్టర్లకు(AP Junior Doctors) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న స్టైఫండ్ పెంపు విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులతో పాటు పీజీ, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు అభ్యసిస్తున్న వైద్యులకు ఈ స్టైఫండ్ పెంపు వర్తించనుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాత్రింబవళ్లు ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న జూనియర్ డాక్టర్ల సేవలను గుర్తించి, వారికి ఆర్థికంగా ఊరట కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Varupula Subbarao: వైసీపీకి మరో బిగ్‌ షాక్.. జనసేనలో చేరిన ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే సుబ్బారావు

కోర్సుల వారీగా పెంపు వివరాలు & ప్రభుత్వంపై అదనపు భారం:

ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం MBBS, BDS హౌస్‌సర్జన్లకు ప్రస్తుతం ఇస్తున్న స్టైఫండ్‌పై 10 శాతం పెంపు లభించనుంది. అలాగే పీజీ వైద్య విద్యార్థులకు 5 శాతం, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు చేస్తున్న జూనియర్ డాక్టర్లకు 3.5 శాతం చొప్పున అలవెన్సులు పెరగనున్నాయి. ఈ పెంపు అమలుతో రాష్ట్ర ఖజానాపై ప్రతి ఏడాది సుమారు రూ.34.08 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. అయినప్పటికీ, వైద్యుల సంక్షేమం దృష్ట్యా ఈ నిధులను కేటాయించడంపై జూనియర్ డాక్టర్లు, మెడికల్ అసోసియేషన్లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.