Kerosene Distribution: ఏపీలో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. రేపటి నుంచే.. ఒక్కొక్కరికి ఎంత అంటే
గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్రం సుమారుగా 2వేల 800 కిలో లీటర్ల కిరోసిన్ ను రాష్ట్రానికి కేటాయించింది.
- Naveen
- Published On : March 22, 2026 / 08:47 PM IST
Kerosene Distribution: ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ చేయనున్నారు. వంట గ్యాస్ సరఫరాలో తలెత్తిన తాత్కాలిక ఇబ్బందులను అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే రేషన్ కార్డుదారులకు ఊరటనిస్తూ మళ్లీ కిరోసిన్ పంపిణీని ప్రారంభించాలని నిర్ణయించింది. రేపటి నుంచే ఈ పంపిణీ ప్రక్రియ షురూ కానుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం రేపటి నుంచి లీటర్ చొప్పున కిరోసిన్ పంపిణీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్ ను కిరోసిన్ రహిత రాష్ట్రంగా మార్చినప్పటికీ సంక్షోభ పరిస్థితుల కారణంగా మళ్లీ సరఫరా చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
హర్మూజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల గ్యాస్ నౌకల రాకల ఆలస్యమైంది. ఈ నెల 21న విశాఖకు చేరుకోవాల్సిన ఎల్పీజీ నౌక 26న చేరుకుంటుందని కేంద్రం తెలిపింది. గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్రం సుమారుగా 2వేల 800 కిలో లీటర్ల కిరోసిన్ ను రాష్ట్రానికి కేటాయించింది.
Also Read: 2004లో అందుకే ఓడిపోయాం, మళ్లీ మేము వచ్చాకే ఏపీలో అభివృద్ధి- సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
