మున్సిపల్ ఎన్నికలు యధావిధిగా జరుగుతాయని హైకోర్టు ఆదేశాలు
- bheemraj
- Published On : March 2, 2021 / 07:58 PM IST
AP High Court dismisses writ petitions : మున్సిపల్ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని దాఖలైన రిట్ అప్పీల్స్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సంవత్సరం క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడు కొనసాగించడం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. కోవిడ్ వలన సామాజిక మార్పులు జరిగాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అయితే ఎన్నికలు నిర్వహించాలని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. రిట్ అప్పీల్స్‌పై ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ధర్మాసనం వాటిని కొట్టివేసింది. మున్సిపల్ ఎన్నికలు యధావిధిగా జరుగుతాయని ఆదేశాలు జారీ చేసింది.
