Rushikonda Buildings: రుషికొండ భవనాలపై మళ్లీ ఉత్కంఠ.. హై కోర్ట్ కీలక ఆదేశాలు..

విశాఖపట్నంలోని రుషికొండ భవనాల(Rushikonda Buildings) నిర్మాణం, వాటి వినియోగంపై గత కొంతకాలంగా సాగుతున్న వివాదం ఇప్పుడు న్యాయస్థానం పరిధిలోకి చేరింది.

AP High Court issues key orders regarding using of Rushikonda buildings

  • రుషికొండ భవనాలపై కోర్టు ఆదేశాలు

  • తుది నిర్ణయం తీసుకోవద్దని స్పష్టీకరణ

  • స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరణ

Rushikonda Buildings: విశాఖపట్నంలోని రుషికొండ భవనాల నిర్మాణం(Rushikonda Buildings), వాటి వినియోగంపై గత కొంతకాలంగా సాగుతున్న వివాదం ఇప్పుడు న్యాయస్థానం పరిధిలోకి చేరింది. పర్యావరణ నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో, ఈ భవనాల భవిష్యత్తుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ, ఈ వ్యవహారంలో తదుపరి అడుగులపై స్పష్టతనిచ్చింది.

EPFO: EPF చందాదారులకు గుడ్ న్యూస్.. రూ.1.44 లక్షల కోట్ల నిధులు సిద్ధం.. ఖాతాల్లో జమయ్యేది ఎప్పుడో తెలుసా?

ఈ భవనాల వినియోగానికి సంబంధించి ఎలాంటి తుది నిర్ణయం తీసుకోరాదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సీఆర్‌జెడ్ (తీరప్రాంత నియంత్రణ మండలి) నిబంధనలను ఉల్లంఘించి ఈ నిర్మాణాలు చేపట్టారంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ జరిపింది. అయితే, ప్రస్తుతం కేవలం భవనాల వినియోగంపై ‘ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్’ ప్రక్రియ మాత్రమే నడుస్తోందని ప్రభుత్వం కోర్టుకు తెలపడంతో, ప్రస్తుతానికి ఈ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ భవనాలు అప్పట్లో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. పర్యావరణాన్ని ధ్వంసం చేసి వీటిని నిర్మించారంటూ అప్పటి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ, వివాదాస్పదంగా మారిన ఈ రుషికొండ భవనాలను ఎలా ఉపయోగించాలనే దానిపై ఇంకా ఎలాంటి అధికారిక తుది నిర్ణయం తీసుకోలేదు. కోర్టు తదుపరి విచారణలో ఈ అంశంపై మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.