AP High Court: వైసీపీ నేత అంబటి రాంబాబు భార్య హౌస్ మోషన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనలో హైకోర్టు సీరియస్ అయ్యింది. అంబటి కుటుంబానికి 24 గంటల భద్రత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చే వరకు భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ శ్రేణులు అంబటి రాంబాబుపై భగ్గుమన్నాయి. గుంటూరులో అంబటి ఇల్లు, పార్టీ ఆఫీస్ పై దాడి జరిగింది. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలంటూ అంబటి భార్య విజయలక్ష్మి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ నిన్న దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై నేడు కోర్టు విచారణ జరిపింది. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చే వరకు 24 గంటలు అంబటి కుటుంబానికి భద్రత కల్పించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యవహారంలో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ యంత్రాంగం అంబటికి, ఆయన కుటుంబానికి భద్రత కల్పించాలంది.
Also Read: ఏపీలో మరో వైసీపీ నేత ఇంటిపై దాడి.. నిప్పు పెట్టిన టీడీపీ శ్రేణులు