AP Inter Supplementary Results: ఏపీ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అప్‌డేట్.. సప్లిమెంటరీ ఫలితాలు ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ(AP Inter Supplementary Results), ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు శుభవార్త.

Ap inter advanced supplementary and improvement results update

  • జూన్ 18లోపు ఫలితాల విడుదల
  • 13 రోజుల్లో మూల్యాంకనం పూర్తి
  • ఇంప్రూవ్‌మెంట్ విద్యార్థులకు కీలక అప్‌డేట్

AP Inter Supplementary Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు శుభవార్త. ఈ పరీక్షల ఫలితాలను జూన్ 18లోపు విడుదల చేయాలని ఇంటర్మీడియట్ విద్యామండలి యోచిస్తోంది. పరీక్షల ప్రక్రియ ముగిసిన వెంటనే మూల్యాంకనాన్ని వేగంగా పూర్తి చేసి తక్కువ సమయంలోనే ఫలితాలను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో వేలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Ktr: కాంగ్రెస్ లో డబ్బులిస్తేనే పదవులు.. వచ్చే ఎన్నికల్లో పత్తా ఉండదు.. మాదెప్పుడు ఒంటరి పోరే.. చిట్ చాట్ లో కేటీఆర్ సంచలన కామెంట్స్

ఈ ఏడాది అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ(AP Inter Supplementary Results), ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు మే 21న ప్రారంభమై జూన్ 5తో ముగిశాయి. మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ముఖ్యంగా ఈసారి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పించడం విశేషం. దీంతో తమ మార్కులను మెరుగుపరుచుకోవాలనుకున్న విద్యార్థులు పెద్ద సంఖ్యలో పరీక్షలు రాశారు.

పరీక్షలు పూర్తైన తర్వాత మూల్యాంకన ప్రక్రియను వేగవంతంగా నిర్వహించి 13 రోజుల్లోపు ఫలితాలను విడుదల చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు ప్రాక్టికల్ పరీక్షలు జిల్లా కేంద్రాల్లో జూన్ 7 నుంచి జూన్ 11 వరకు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్స్ పూర్తైన అనంతరం తుది ఫలితాల ప్రకటనకు మార్గం సుగమం కానుంది. దీంతో విద్యార్థులు తదుపరి విద్యా ప్రణాళికలపై దృష్టి సారించేందుకు అవకాశం లభించనుంది.