Minister Anil Kumar : చంద్రబాబుపై మంత్రి అనిల్ కుమార్ తీవ్ర విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు లాంటి దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరమన్నారు.
- bheemraj
- Published On : October 23, 2021 / 12:58 PM IST
Anil Kumar
Anil Kumar comments over Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు లాంటి దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరమన్నారు. ఈ మేరకు మంత్రి నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, ఆయన సుపుత్రుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ను అనరాని మాటలు అన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని, ఆయన తల్లిని విమర్శిస్తే.. ఉప్పు, కారం తిన్న వారు ఎవరు చూస్తూ ఉండరని తెలిపారు.
గుంటూరు జిల్లాలో ఉప్పు, కారం ఎక్కువగా తింటారు.. కాబట్టి పౌరుషం, రోషం ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఒక పక్క గిచ్చడం మరోపక్క మాపై దాడి చేశారని అని దొంగ దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అబ్బా, కొడుకులు ఎన్ని దొంగ దీక్షలు చేసినా ఈ రాష్ట్రంలో ఎవ్వరు ఏమీ పికలేరని మండిపడ్డారు.
CPI RamaKrishna: చంద్రబాబు అలా చేస్తే, జగన్ నెత్తిన పాలు పోసినట్లే -సీపీఐ రామకృష్ణ
సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ తో ఏపీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసిందన్నారు. డ్రగ్స్ ను ఎవరు ప్రోత్సహిస్తూన్నారో చూస్తే మీ మూలాలు కనిపిస్తాయని చెప్పారు. డ్రగ్స్ తీసుకునే అలవాటు మీకు ఉంటే దాన్ని వైసీపీపై రుద్దడం దారుణం అన్నారు.
కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప…ఏ రోజు అయినా ప్రజా సమస్యలపై పోరాటం చేశారా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమపై దాడులు జరిగినా ఇక్కడే ఉన్నామని.. మీలా హైదరాబాద్ లో దాక్కోలేదని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
