AP Anganwadi Recruitment : మహిళలకు సర్కార్ శుభవార్త.. అంగన్వాడీ పోస్టుల భర్తీపై కీలక ప్రకటన..
AP Anganwadi Recruitment : మహిళలకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ శుభవార్త చెప్పింది.
- Dharani Pilli
- Updated on- April 28, 2026 / 11:57 AM IST
ap minister gummadi sandhya rani says very soon anganwadi posts recruitment will be done
- ఏపీ సర్కార్ శుభవార్త
- త్వరలోనే అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ
- తొలి విడతలో 2,645 పోస్టుల భర్తీ
AP Anganwadi Recruitment : నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ శుభవార్త చెప్పింది. త్వరలోనే రాష్ట్రంలో అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేశామని.. చిన్నారులు, మహిళల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను.. ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. ఈ నిర్ణయం వల్ల అప్‌గ్రేడ్ చేసే కేంద్రాల్లో అదనపు సిబ్బంది అవసరం ఉంటుందని తెలిపారు. అలానే ఈ కొత్త అంగన్వాడీ కేంద్రాల్లో కొత్తగా సహాయకులను నియమించేందుకు ప్రభుత్వం అనుమతించిందన్నారు.
తొలి విడతలో భాగంగా 2,645 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించారు. మిగిలిన పోస్టులను రెండో విడతలో భర్తీ చేస్తామని తెలిపారు. ఈ నియామకాలకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. త్వరలోనే దీనిపై పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల కానుంది.
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల సేవలను మరింత బలోపేతం చేసేందుకు.. వేగవంతమై సర్వీసులు అందించేందు అన్ని చర్యలు తీసకుంటుంది. ఇందుకోసం మొత్తం 58,204 మంది కార్యకర్తలు, సూపర్ వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు ఇటీవలే ప్రభుత్వం స్మార్ట్ 5జీ ఫోన్లు అందించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. కేంద్రం ప్రారంభించిన సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవనజ్యోతి బీమా యోజ పథకాలను అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు వర్తింపజేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా 18-50 ఏళ్ల మధ్యలో ఉన్న అంగన్వాడీ సిబ్బంది.. పీఎం జీవనజ్యోతి బీమా యోజన వర్తింపజేస్తున్నారు. అయితే, ఈ పథకం కింద ఏడాదికి రూ. 436 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
