AP Municipal Elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కూటమి రెడీ.. టీడీపీ, జనసేన అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే!
AP Municipal Elections : ఏపీలో పెండింగ్‌లో ఉన్న 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ, జనసేన మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- November 15, 2026 / 09:46 PM IST
AP Municipal Elections
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేడి..
- 23 పట్టణ స్థానిక సంస్థలకు కూటమి అభ్యర్థులు వీరే
- మేయర్, చైర్మన్ అభ్యర్థులుగా ఎవరెవరంటే?
- టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రకటనతో రాజకీయ వేడి
AP Municipal Elections : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పెండింగ్‌లో ఉన్న 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో అధికార కూటమి అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా టీడీపీ, జనసేన తమ మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలైంది..
టీడీపీ నుంచి బరిలో వీరే.. :
టీడీపీ ఒక కార్పొరేషన్‌తో పాటు పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మంగళగిరి-తాడేపల్లి మేయర్ అభ్యర్థిగా ఏడుకొండలు పేరును ప్రకటించింది. ఆమదాలవలసకు ప్రమీల, తణుకుకు రామకృష్ణ, పాలకొల్లుకు ఉషారాణి, తాడిగడపకు పీతా గోపీచంద్, గుడివాడకు కరుణను ఎంపిక చేసింది..
Read Also : Mera Ration App : రేషన్ కార్డు మిస్సయిందా? ఆధార్ ఉంటే చాలు.. మీ ఫోన్లోనే డౌన్లోడ్ ఇలా..
అలాగే, నరసరావుపేటకు రూపేష్ గుప్తా, పొన్నూరుకు విజయలక్ష్మి, కందుకూరుకు వెంకటేశ్వర్లు, గూడూరుకు శిరీష, శ్రీకాళహస్తికి బాలాజీ పేర్లను ఖరారు చేసింది. నగర పంచాయతీల విషయానికి వస్తే.. చింతలపూడి నుంచి ఎస్తేరు రాణి, పొదిలి నుంచి అనిల్‌కుమార్, అల్లూరు నుంచి సునీల్‌కుమార్, బి.కొత్తకోట నుంచి శ్రీనివాసులు పోటీ చేయనున్నారు.
జనసేన అభ్యర్థులు వీరే.. :
మరోవైపు జనసేన పార్టీ కూడా 2 కార్పొరేషన్లు, 3 మున్సిపాలిటీలకు అభ్యర్థులను ప్రకటించింది. శ్రీకాకుళం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా డా. దానేటి రాధా రాణి, కాకినాడకు ఆకుల భవానిని ఎంపిక చేసింది.
రాజాం మున్సిపాలిటీకి బనిశెట్టి సౌజన్య లత, భీమవరానికి డా. చుండూరి మల్లేశ్వరి, తాడేపల్లిగూడెంకు పాలూరు వెంకటేశ్వర రావును చైర్మన్ అభ్యర్థులుగా ప్రకటించింది. కాగా, కూటమి పార్టీల అభ్యర్థుల ప్రకటనతో మున్సిపల్ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. అభ్యర్థులు తమ తమ ప్రాంతాల్లో ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
