Ap Pension New Rules: ఏపీ పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. డైరెక్ట్ అకౌంట్స్ లోకి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక భద్రతా పింఛన్ల (Ap Pension New Rules)పంపిణీ ప్రక్రియలో ప్రభుత్వం సంచలన మార్పులు చేపట్టింది.
- V Santhosh Kumar
- Published on- October 3, 2026 / 10:28 PM IST
Ap pension distribution new rules from november 1
Ap Pension New Rules: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ ప్రక్రియలో ప్రభుత్వం సంచలన మార్పులు చేపట్టింది. నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త విధానం ప్రకారం, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద లభించే కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు ఇకపై నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా తీసుకొచ్చిన ఈ మార్పుపై గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సెర్ప్ సీఈఓ వాకాటి కరుణ స్పష్టత ఇచ్చారు. ఈ నూతన పద్ధతి ద్వారా పింఛన్ల అందజేతలో మరింత పారదర్శకత పెరుగుతుందని, మధ్యవర్తుల జోక్యం పూర్తిగా తొలగిపోతుందని అధికారులు భావిస్తున్నారు.
Mad Sandhu Murder: పంజాబ్‌లో ఘోర ఘటన.. ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ మ్యాడ్ సంధు హత్య.. నడిరోడ్డుపై కాల్చి
లబ్ధిదారులకు మిగిలే నగదు పంపిణీ వివరాలు:
ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇస్తున్న పింఛన్లలో(Ap Pension New Rules) కేంద్ర వాటా మినహాయించి, మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ వాటాను మాత్రమే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతినెలా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా అందిస్తారు. ఉదాహరణకు, వృద్ధులకు అందే రూ.4,000 పింఛనులో రాష్ట్ర వాటా రూ.3,800 చేతికి అందగా, కేంద్ర వాటా రూ.200 నేరుగా బ్యాంక్ అకౌంట్‌లో పడుతుంది. అలాగే దివ్యాంగుల రూ.6,000 పింఛనులో రూ.5,700 చేతికి ఇవ్వగా, రూ.300 బ్యాంక్ ఖాతాలో జమ కానుంది.
ఆధార్ అనుసంధానం తప్పనిసరి:
అయితే ఈ కేంద్ర నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావాలంటే బ్యాంక్ అకౌంట్‌కు తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం పూర్తయి ఉండాలి. ఆధార్ అనుసంధానం లేకపోతే కేంద్ర వాటా డబ్బులు అకౌంట్‌లో జమ కావు. కాబట్టి లబ్ధిదారులు వెంటనే తమ బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం హెచ్చరించింది.
