AP Rains : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు దంచికొట్టనున్న వానలు.. హెచ్చరికలు జారీ
AP Rains : ఏపీలోని పలు ప్రాంతాల్లో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే, వాతావరణ శాఖ వర్షాలపై తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది.
- Harish Thanniru
- Published on- August 7, 2026 / 07:00 AM IST
Andhra pradesh weather update heavy rains two days
- ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. ఏపీకి వర్ష సూచన
- హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
- రెండు రోజులు ఆయా జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు
AP Rains : ఏపీలోని పలు ప్రాంతాల్లో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే, వాతావరణ శాఖ వర్షాలపై తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశాపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులు పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
Also Read : Vande Bharat Double Decker: వందే భారత్ డబుల్ డెక్కర్ రైలు.. 160 కి.మీ వేగం.. ప్రయాణికులు, సరుకులు ఒకేసారి!
శుక్రవారం, శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈదురుగాలులు, వర్షాల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు వద్ద ఉండొద్దని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్న అధికారులు.. ఏలూరు, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే ఈనెల 14న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా గురువారం ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్రలో ఈదురుగాలులతో వర్షం పడింది. విశాఖపట్టణం జిల్లా బుచ్చిరాజుపాలెంలో 9.17 సెంటీమీటర్లు, మహారాణిపేటలో 8.9 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 8.62 సెంటీమీటర్లు, పార్వతీపురం జిల్లా సాలూరులో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
