AP Covid Update : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 348 కోవిడ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 348 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.

  • Updated on- November 10, 2021 / 06:53 PM IST

Ap Covid Update

AP Covid Update :  ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 348 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 358 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3 వేల 220 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షల 69వేల 066 కి చేరింది. వీరిలో 20 లక్షల 51 వేల 440 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఏపీలో గత 24 గంటల్లో కోవిడ్ వల్ల ముగ్గురు మరణించారు. వీరిలో ఒకరు కృష్ణా, మరోకరు చిత్తూరు, మరోకరు విశాఖపట్నం జిల్లాలకు చెందిన వారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14 వేల 406కు చేరింది.

Also Read : Minor Girl Kidnap : మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న మైనర్ బాలుడు

నిన్నటివరకు రాష్ట్రంలో 2 కోట్ల 98లక్షల 46వేల 690 మంది శాంపిల్స్ పరీక్షించటం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో వైపు దేశ వ్యాప్తంగా జరుగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా భారతదేశం 100 కోట్ల మార్కును దాటింది. బుధవారం సాయంత్రం 6గంటల సమయానికి సుమారుగా 110,21,06,235 మందికి వ్యాక్సిన్ వేశారు.