AP Corona : ఏపీలో కొత్తగా 222 కరోనా కేసులు
ఏపీలో గడచిన 24 గంటల్లో 31వేల 473 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 222 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మరో ఇద్దరు కరోనాతో చనిపోయారు.
- Naveen
- Published On : November 18, 2021 / 07:10 PM IST
Ap Corona Cases
AP Corona : ఏపీలో గడచిన 24 గంటల్లో 31వేల 473 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 222 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మరో ఇద్దరు కరోనాతో చనిపోయారు. కృష్ణా జిల్లాలో ఒకరు, ప్రకాశం జిల్లాలో ఒకరు మరణించారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 38 కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 35, కృష్ణా జిల్లాలో 31, చిత్తూరు జిల్లాలో 28, నెల్లూరు జిల్లాలో 24 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ఒక పాజిటివ్ కేసును గుర్తించారు.
Urine : మూత్రం ఎరుపులో రంగులో ఉంటే డేంజర్లో పడ్డట్టేనా…
అదే సమయంలో 275 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,70,738 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,53,755 మంది కోలుకున్నారు. 2వేల 560 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14వేల 423కి పెరిగింది.
#COVIDUpdates: 18/11/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,67,843 పాజిటివ్ కేసు లకు గాను
*20,50,860 మంది డిశ్చార్జ్ కాగా
*14,423 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,560#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/cKm2uw3z9A— ArogyaAndhra (@ArogyaAndhra) November 18, 2021
