Holidays: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆగస్టు నెలలో సెలవులే సెలవులు.. సింహాచలం వారికీ అదనంగా రెండు రోజులు
ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఆగస్టు నెల వరుస పండుగలు రావడంతో భారీగా సెలవులు (Holidays)లభించనున్నాయి.
- V Santhosh Kumar
- Published on- July 27, 2026 / 11:36 AM IST
Ap schools colleges august holidays list simhachalam giri pradakshina
- ఆగస్టులో పది రోజులు సెలవులు
- కేవలం ఇరవైఒక్క రోజులే పాఠశాలలు
- సింహాచలం గిరిప్రదక్షిణకు ప్రత్యేక సెలవులు
Holidays: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు రాబోయే ఆగస్టు నెల సందడిగా మారనుంది. సాధారణంగా వచ్చే ఆదివారాలతో పాటు వరుస పండుగలు రావడంతో విద్యార్థులకు భారీగా సెలవులు లభించనున్నాయి. ఈ నెలలో మొత్తం 31 రోజులు ఉండగా, ఏకంగా 10 రోజుల పాటు విద్యాసంస్థలు మూతపడనున్నాయి. అంటే కేవలం 21 రోజులు మాత్రమే తరగతులు సాగుతాయి. ఈ నెలలో ఐదు ఆదివారాలు రావడం, స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15), వరలక్ష్మి వ్రతం (ఆగస్టు 21), మిలాదున్ నబి (ఆగస్టు 25) వంటి ప్రధాన పండుగలు ఉండటంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు విరామం లభించనుంది. ఉద్యోగులకు కూడా ప్రత్యేక ఆప్షనల్ సెలవులు అందుబాటులో ఉన్నాయి.
Tirumala: మళ్ళీ భయపెడుతున్న కరోనా.. తిరుపతిలో మొదటి కేసు.. అప్రమత్తమైన అధికారులు
ఆగస్టు నెల ప్రధాన సెలవుల జాబితా ఇదే:
ఆగస్టు 2, 9, 16, 23, 30 తేదీలలో ఆదివారాలు, ఆగస్టు 8న రెండో శనివారం సెలవులు(Holidays) ఉంటాయి. అలాగే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం జెండా వందనం నిర్వహించగా, ఆగస్టు 21న వరలక్ష్మి వ్రతం, 25న మిలాదున్ నబి సందర్భంగా సెలవులు అమలవుతాయి. రాఖీ పౌర్ణమి, ఇతర పండుగలకు ఆప్షనల్ సెలవులు ఉండనున్నాయి. అయితే వాతావరణం, స్థానిక పరిస్థితుల ఆధారంగా సెలవుల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
విశాఖ సింహాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సెలవులు:
మరోవైపు విశాఖపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో జరిగే వార్షిక గిరిప్రదక్షిణ మహోత్సవాన్ని పురస్కరించుకుని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీ, ట్రాఫిక్ నివారణ, భద్రతను దృష్టిలో ఉంచుకుని జులై 28, 29 తేదీల్లో గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న 221 పాఠశాలలు, కళాశాలలకు ప్రత్యేక సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
