ఒకటి కాదు మూడు : రాజధానిపై అసెంబ్లీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. లెజిస్లేటివ్ కేపిటల్ అమరావతిలో, జ్యుడీషియల్ కేపిటల్

  • Publish Date - January 18, 2020 / 03:59 PM IST

ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. లెజిస్లేటివ్ కేపిటల్ అమరావతిలో, జ్యుడీషియల్ కేపిటల్

ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. లెజిస్లేటివ్ కేపిటల్ అమరావతిలో, జ్యుడీషియల్ కేపిటల్ కర్నూలులో, పరిపాలన రాజధాని విశాఖలో ఉంటాయని స్పీకర్ చెప్పారు. కాగా, అసెంబ్లీ సమ్మర్ సెషన్స్ అమరావతిలో పెడతారా? విశాఖలో పెడతారా? అనేది జగన్ ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. జనవరి 20న సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశాలు సాధారణంగానే జరుగుతాయన్నారు. నిరసనలు, రాజధానిపై స్టేట్ మెంట్లు కామన్ అని స్పీకర్ చెప్పారు. వ్యతిరేకించే వారు ఎప్పుడూ ఉంటారని అన్నారు. ఉత్తరాంధ్ర పౌరుడిగా 3 రాజధానులు ఉండాలనేది తన నిర్ణయం అని స్పీకర్ తమ్మినేని స్పష్టం చేశారు. అయితే సభలో చర్చ జరక్కుండా నాకంటూ ప్రత్యేకమైన ఆలోచన ఉండటానికి లేదన్నారు.

మూడు రాజధానులే ముద్దు:
ఒకటి కాదు మూడు రాజధానులు అంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఇలాంటి కామెంట్స్ రావడంతో.. ఏపీకి మూడు రాజధానులు అనే విషయం ఫైనల్ అని తేలిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ సమావేశాలు జరగడానికి కొన్ని గంటల ముందు.. స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాజధానిపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చేసినట్టే అని అనుకుంటున్నారు.

అంతా జగన్ అనుకున్నట్టే..
కాగా, రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం తాను అనుకున్నట్టుగానే ముందుకు సాగుతోంది. మూడు రాజధానులే ముద్దు అంటోంది సీఎం జగన్ సర్కార్. రెండు కమిటీల నివేదికలు, హైపవర్ కమిటీ అధ్యయనం తర్వాత సీఎం జగన్ ఫైనల్‌గా మూడు రాజధానులకే ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. సోమవారం(జనవరి 20, 2020) కేబినెట్ మీటింగ్ అనంతరం అసెంబ్లీలో దీనిపై చర్చ జరగనుంది. సాంకేతిక అంశాలపై నిపుణుల సలహాలు తీసుకుంటారు. ఇక పరిపాలన రాజధాని విశాఖకు తరలించడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. జనవరి 26 తర్వాత ఈ కార్యక్రమాలు స్పీడ్ అందుకోనున్నాయని సమాచారం.

కాగా, అసెంబ్లీలో జగన్ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ.. మండలిలో కొంత ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ వైసీపీకి బలం లేదు. మండలిలో ఎలా వ్యవహరించాలనే దానిపై వైసీపీ కసరత్తు జరుపుతోంది. GN RAO, బోస్టన్ కమిటీలు ఇచ్చిన నివేదికలను హై పవర్ కమిటీ సభ్యులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ప్రభుత్వంతో పలు మార్లు చర్చలు జరిపింది. కీలక సూచనలు చేశారు సభ్యులు. 

Also Read : జగన్.. సీఎం పదవి పోయింది : కృష్ణా, గుంటూరు మగవాళ్ల కంటే మా ఆడవాళ్లే నయం