AP 10th Supplementary Exams : ఏపీలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఇవే.. పేపర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఇలా చేయండి..

AP 10th Supplementary Exam Dates 2026 : టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థుల కోసం ప్రభుత్వం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనుంది. ఈ మేరకు పరీక్షల తేదీలను ప్రకటించింది.

AP SSC Supplementary Exams 2026 Dates Recounting Reverification Application Details

  • ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల
  • రాష్ట్ర వ్యాప్తంగా 85.25శాతం ఉత్తీర్ణత
  • సప్లమెంటరీ పరీక్షల తేదీలు ఇవే..

AP 10th Supplementary: ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఉదయం 11గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 85.25శాతం మంది ఉత్తీర్ణత నమోదైంది. వీరిలో 87.90శాతం మంది బాలికలు, 82.68శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల్లో 78.39శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

Also Read : ఏపీ టెన్త్ ఫలితాలు వచ్చేశాయ్.. డైరెక్ట్ లింక్ ఇక్కడ క్లిక్ చేయండి.. ఏ జిల్లా ఫస్ట్.. ఏ జిల్లా లాస్ట్ అంటే.. ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ

టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థుల కోసం ప్రభుత్వం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనుంది. మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు ఈ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు మే 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పరీక్ష రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అయితే, లేట్ ఫీజు రూ.50తో మే 25తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షల ఫీజును చెల్లించొచ్చు.

రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీ కౌంటింగ్ (సబ్జెక్టు కు రూ.500), రీ వెరిఫికేషన్ (సబ్జెక్టుకు రూ.వెయ్యి) కోసం చెల్లించాల్సి ఉంటుంది.

ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు కీలక సూచన చేశారు. తాజా ఫలితాలు విద్యార్థుల పట్టుదలను, ఉపాధ్యాయులు, విద్యార్థుల కుటుంబాల బలమైన మద్దతును ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. పరీక్షల ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులందరికీ మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రస్తుత ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించనివారు నిరాశ చెందొద్దని, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల మద్దతుతో మీరు మరింత బలంగా తిరిగిరాగలరని అన్నారు. మన విద్యార్థులే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు వెన్నెముక, ప్రతి బిడ్డ విజయం సాధించేలా చూడడానికి మేము కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.