తెలంగాణ, ఏపీలో సంక్రాంతి సెలవులు ఇవే!

  • Publish Date - January 7, 2020 / 06:10 AM IST

సంక్రాంతి సెలవులు వచ్చేశాయి.. ఏపీలో సంక్రాంతి ఎంతో స్పెషల్.. కోడిపందాలు, గంగిరెద్దులు, బసవన్నల కోలాహలం.. సెలవుల్లో పిల్లలు ఎగరేసే పతంగులు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకే ఏపీ ప్రభుత్వం సంక్రాంతికి 10 రోజులు సెలవులను ప్రకటించింది. జనవరి 10 నుంచి మొదలు జనవరి 20 వరకు సంక్రాంతి సెలవులు కొనసాగనున్నాయి. జనవరి 21న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. 

కానీ, తెలంగాణలో మాత్రం కేవలం 6 రోజులే ఉన్నాయి. జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు వర్తించనున్నాయి. జనవరి 17న తిరిగి బడులు తెరచుకోనున్నాయి. జూనియర్ కాలేజీలకు కూడా ఇవే సెలవులు వర్తించనున్నాయి. 

అది అలా ఉండగా.. రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీలు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా పదోతరగతి, ఇంటర్ విద్యార్థులకు సెలవుల్లో కూడా స్పెషల్ క్లాసులంటూ తరగతులు నిర్వహిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది.