Ap Rains: ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక.. ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో జోరుగా వానలు.. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి!

నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా విస్తరిస్తుండటంతో రాష్ట్రంలో వర్షాలు(Ap Rains) జోరందుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

Ap weather alert thunderstorms and strong winds expected over next three days

  • ఏపీలో విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
  • పిడుగులతో కూడిన వర్షాల హెచ్చరిక
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

Ap Rains: నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా విస్తరిస్తుండటంతో రాష్ట్రంలో వర్షాలు జోరందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలను తాకిన రుతుపవనాలు రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో ఉత్తరాంధ్రలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Gnaneswari Missing: ఎక్కడున్నావమ్మా జ్ఞానేశ్వరి.. మీకు కనిపిస్తే ఈ నంబర్స్ కి కాల్ చేయండి

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో పాటు దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ప్రభావం చూపుతోంది. వీటి ప్రభావంతో పోలవరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమ జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంచి వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా వంగిపురంలో 27.5 మిల్లీమీటర్లు, చిత్తూరు జిల్లా గంగవరంలో 23.5 మిల్లీమీటర్లు, పలమనేరులో 23.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో రాష్ట్ర సగటు వర్షపాతం 8.8 మిల్లీమీటర్లుగా నమోదవగా, ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 57.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఏలూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో కూడా గణనీయమైన వర్షపాతం నమోదైంది. వర్షాల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని, రైతులు, పశుకాపరులు ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.