AP Weather : ఏపీకి కూల్ న్యూస్.. ఈ జిల్లాల్లో మూడు రోజులు వర్షాలే.. ఉరుములు, మెరుపులతో భారీ అలర్ట్!

AP Weather : ఏపీలో ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ కాస్త ఊరటనిచ్చేలా చల్లటి కబురు చెప్పింది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Andhra pradesh weather update

AP Weather : ఏపీలో ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ కాస్త ఊరటనిచ్చేలా చల్లటి కబురు చెప్పింది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. అయితే పిడుగులు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

Also Read : Singeetham Srinivasa Rao : పవన్ కళ్యాణ్ తో సింగీతం శ్రీనివాసరావు సినిమా.. జీసస్ గొప్పదనంపై.. ఓపెనింగ్ అయింది కానీ..

తమిళనాడు, కేరళ రాష్ట్రాల మీదుగా అరేబియా సముద్రం వరకు ఆకాశంలో మేఘాలు, గాలులతో కూడిన ద్రోణి ఏర్పడింది. కర్ణాటకవైపు ఉన్న మరో ఉపరితల ఆవర్తనం కూడా ఈ ద్రోణిలో విలీనమైంది. ఈ ప్రభావంతో ఏపీ, యానాం పరిసర ప్రాంతాల్లో వర్సాలు దంచికొట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా సోమ, మంగళవారాల్లో వాతావరణం చల్లబడి.. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు సైతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

వచ్చే మూడ్రోజులు ఏపీలోని ఉత్తరకోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర తీరప్రాంత జిల్లాల్లో వాతావరణం పూర్తిగా మారిపోతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అనకాపల్లి, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది.. అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉంది. పలు ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది.

మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో వాతావరణ హెచ్చరికలను గమనించాలని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు.. మరోవైపు రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోనూ మధ్యాహ్నం తర్వాత ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నాయి.

వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఉరుములతో కూడిన వర్షాల, ఈదురుగాలుల సమయంలో రైతులు, కూలీలు పొలాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.