Singeetham Srinivasa Rao : పవన్ కళ్యాణ్ తో సింగీతం శ్రీనివాసరావు సినిమా.. జీసస్ గొప్పదనంపై.. ఓపెనింగ్ అయింది కానీ..
ఎన్నో పాత్ బ్రేకింగ్ సినిమాలను అందించిన సింగీతం శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ తో కూడా ఒక సినిమా ప్లాన్ చేసారు. (Singeetham Srinivasa Rao)
Singeetham Srinivasa Rao
Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా లెజెండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు నిన్న రాత్రి ఆకస్మికంగా మరణించారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సింగీతం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో తెలుగు, తమిళ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. అనేకమంది సెలబ్రిటీలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. సింగీతం మరణంతో ఆయన గురించి పలు విషయాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఎన్నో పాత్ బ్రేకింగ్ సినిమాలను అందించిన సింగీతం శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ తో కూడా ఒక సినిమా ప్లాన్ చేసారు. 2010 లో ప్రిన్స్ ఆఫ్ పీస్ అనే సినిమాని పవన్ కళ్యాణ్ హీరోగా, అనుష్క శెట్టి హీరోయిన్ గా ప్రకటించారు. యేసుక్రీస్తు గొప్పదనం, ఆయన చేసిన పనులు, ఆయన అందించిన సందేశాలను చూపిస్తూ ఒక కథగా రాసుకున్నారు. ఇది జీసస్ జీవిత చరిత్ర కాదు, ఆయన సందేశాలతో ప్రస్తుత కాలంలో జరిగే కథ అని ప్రకటించారు.
Also Read : Divi : లవ్ బ్రేకప్స్ అయ్యాయి.. లివ్ ఇన్ రిలేషన్ లో ఉండాలి.. పెళ్లిపై దివి కామెంట్స్ వైరల్..
కొండా కృష్ణం రాజు నిర్మాతగా సింగీతం శ్రీనివాసరావు దర్శకుడిగా పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమాని ఓపెనింగ్ కూడా చేసారు. షూటింగ్ కోసం ఇజ్రాయెల్, జెరూసలేం, జోర్డాన్, బెత్లహేం.. వంటి జీసస్ ప్రభావిత ప్రాంతాలకు కూడా పర్యటించారు. పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రదేశాలకు వెళ్లారు. ఈ సినిమాని ఇంగ్లీష్ లో కూడా తీసి హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ స్క్రిప్ట్ కి ఎక్కువ సమయం పట్టడం, అప్పటి రోజుల్లో భారీ బడ్జెట్ అవుతుండటం, పవన్ వేరే సినిమాలతో బిజీ అవ్వడంతో ఆ సినిమా ఆగిపోయింది. షూటింగ్ మొదలవ్వకుండానే ప్రిన్స్ ఆఫ్ పీస్ సినిమా ఆగిపోయింది. ఒకవేళ ఆ సినిమా కూడా చేసి ఉంటే సింగీతం – పవన్ కళ్యాణ్ కెరీర్లో స్పెషల్ మూవీగా నిలిచేది.
