AP Weather : ఏపీలో వేగంగా మారుతున్న వాతావరణం.. 15జిల్లాలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు..

AP Weather : ఏపీలో వాతావరణం వేగంగా మారుతోంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే చాన్స్ ఉందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది.

AP Weather Updates

AP Weather : ఏపీలో వాతావరణం వేగంగా మారుతోంది. గత వారంరోజులుగా రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దీనికితోడు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా రైతులు సాగుచేసిన పంటలు వర్షాలులేక ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు వాతావరణశాఖ వర్షాలపై బిగ్ అప్డేట్ ఇచ్చింది.

Also Read : AP Local Body Elections : లోకల్ ఫైట్‌లో కూటమి మాస్టర్ ప్లాన్‌! వైసీపీకి బిగ్‌షాక్ తప్పదా? గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయ్‌?

గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 0.9కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. మరోవైపు ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు మరో ద్రోణి కొనసాగుతోంది. బీహార్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, విదర్భ, మరాఠ్వాడ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా ఈ ద్రోణి విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఏపీలో వాతావరణం వేగంగా మారుతోంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే చాన్స్ ఉందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్లేస్‌లలో ఉరుములు, మెరుపులతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇవాళ, రేపు పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లోనూ అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

మరోవైపు బంగాళాఖాతంలో అక్టోబర్ 12వ తేదీన ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తరువాత 24గంటల్లో అంటే అక్టోబర్ 13వ తేదీన అల్పపీడనంగా మారుతుందని, క్రమంగా బలపడి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. అక్టోబర్ నెల కావడంతో తుపాన్‌గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. ప్రస్తుతం పరిస్థితులు కొనసాగితే ఏపీలో వచ్చే వారం భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఉరుములతో కూడిన వర్షాలు, ఈదురుగాలుల సమయంలో రైతులు, కూలీలు పొలాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.