Amaravati capital : అమరావతిలో మరో కీలక భవనానికి అంకురార్పణ.. దీని ప్రత్యేకతలు ఏమిటంటే?
Amaravati capital : ఏపీ రాజధాని అమరావతిలో మరో కీలక భవనానికి అంకురార్పణ జరిగింది. ఆప్కాబ్ కోసం రూ.200 కోట్ల వ్యయంతో ఐకానిక్ భవనాన్ని నిర్మిస్తున్నారు.
- Harish Thanniru
- Published on- June 9, 2026 / 09:18 AM IST
Amaravati capital
- అమరావతిలో మరో కీలక భవనానికి అంకురార్పణ
- రూ.200 కోట్లతో ఆప్కాబ్ ఐకానిక్ భవనం
- అరెకరం విస్తీర్ణంలో జీ + 17 అంతస్తులతో నిర్మాణం
Amaravati capital : ఏపీ రాజధాని అమరావతి (Amaravati) లో భవన నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. జెట్ స్పీడ్‌తో అమరావతి నిర్మాణం కొత్తరూపును సంతరించుకుంటోంది. ఈ క్రమంలోనే రాజధాని ప్రాంతంలో మరో కీలక భవనానికి అంకురార్పణ జరిగింది. రాష్ట్ర సహకార రంగానికి ప్రతీకగా నిలిచే విధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) కోసం రూ.200 కోట్ల వ్యయంతో ఐకానిక్ భవనాన్ని (APCOB iconic building) నిర్మింస్తున్నారు. ఈ భవన నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
అమరావతి రాజధాని ప్రాంతంలోని లింగాయపాలెంలో సుమారు 0.495 ఎకరాల స్థలాన్ని సీఆర్డీఏ కేటాయించగా.. మొత్తం 2.09లక్షల చదరపు అడుగుల్లో.. డీ-17 అంతస్తులతో ఆధునిక భవనాన్ని నిర్మిస్తున్నారు. చివరి అంతస్తులో హెలిప్యాడ్ ఉంటుంది. రూ.200కోట్లతో ఆప్కాబ్ ఐకానిక్ భవనం రూపుదిద్దుకుంటుండగా.. ఇందులో భవన నిర్మాణానికి రూ.87కోట్లు, ఇంటీరియల్ ఇతర సౌకర్యాలకు రూ.113 కోట్లను వెచ్చించనున్నారు. ఆప్కాబ్ అనే అక్షరాలు ప్రతిబింబించేలా ప్లాన్ డిజైన్ చేశారు. నిర్మాణ బాధ్యతలను ఏపీఐఐసీకి అప్పగించారు.
ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణ నాణ్యత, సాంకేతిక ప్రమాణాల విషయంలో దేశంలోని ప్రముఖ విద్యా, పరిశోధనా సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నారు. హైదరాబాద్ ఐఐటీతో పాటు విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కి టెక్చర్ నిపుణులు సాంకేతిక మార్గదర్శకత్వం అందిస్తున్నారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ, ఆర్థిక, వాణిజ్య సంస్థల కార్యాలయాలు వేగంగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో అప్కాబ్ ఐకానిక్ భవనం నిర్మాణం మరో కీలక మైలు రాయిగా సీఆర్డీఏ అధికారులు భావిస్తున్నారు. ఈ భవనం పూర్తయిన తర్వాత సహకార బ్యాంకింగ్ రంగానికి ఆధునిక కేంద్రంగా మారడంతో పాటు అమరావతి స్కైలైను కొత్త గుర్తింపును తీసుకురానుంది.
