ఏపీలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : February 13, 2019 / 08:06 AM IST
ఏపీలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు

Updated On : February 13, 2019 / 8:06 AM IST

ఏపీ అట‌వీశాఖలో ఖాళీగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (AFSO) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) ఫిబ్రవరి 12న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 26 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  

రాతపరీక్ష (స్క్రీనింగ్, మెయిన్)  ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. స్క్రీనింగ్ పరీక్షను జూన్ 6న, మెయిన్ పరీక్షను ఆగస్టు నెలలో నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తుండగా.. స్క్రీనింగ్ పరీక్షను ఆఫ్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు. ఒకవేళ స్క్రీనింగ్ పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య 25వేలలోపు ఉంటే.. వారికి కూడా ఆన్‌‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహించనున్నారు.

పోస్టుల సంఖ్య: 50 (పాతవి 2, కొత్తవి 48)

అర్హత: BSC (బోట‌నీ, ఫారెస్ట్రీ, జువాల‌జీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌,  స్టాటిస్టిక్స్‌, జియాల‌జీ, అగ్రిక‌ల్చర్) లేదా ఇంజినీరింగ్, మెకానిక‌ల్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ ఉండి 18-30 సంవత్సరాల మధ్య వయసున్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

దరఖాస్తు ప్రారంభం :
ఫిబ్రవరి 26 నుంచి దరఖాస్తు ప్రారంభం

దరఖాస్తుకు చివరితేది:
అభ్యర్థులు మార్చి 19 లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 20 దరఖాస్తుకు చివరితేది. 

వయసు:
01.07.2019 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి.  

ఎంపిక‌ విధానం: 
స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్, ఫిజికల్ పరీక్షలు, వైద్య ప‌రీక్షల ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు ఫీజు: 
అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాలి. SC, ST, BC, తెల్లరేషన్ కార్డుదారులకు, నిబంధనల ప్రకారం ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.80 చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.