APSRTC Bus Fire: రన్నింగ్ బస్సులో చెలరేగిన మంటలు.. ఎన్టీఆర్ జిల్లాలో తృటిలో తప్పిన పెను ప్రమాదం
ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం(APSRTC Bus Fire). డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం.
- V Santhosh Kumar
- Published on- June 6, 2026 / 03:30 PM IST
fire broke out in an RTC bus in NTR district (1)
- ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు
- కిటికీల నుండి దూకిన ప్రయాణికులు
- డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
APSRTC Bus Fire: ఎన్టీఆర్ జిల్లాలో శనివారం ఒక ఆర్టీసీ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. జగ్గయ్యపేట డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు ప్రయాణికులతో విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం(APSRTC Bus Fire) జరిగింది. బస్సు గొల్లపూడి సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా ఇంజిన్ నుండి పొగలు, మంటలు వ్యాపించాయి. రన్నింగ్‌లో ఉండగానే బస్సులో మంటలు రావడంతో లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని కబురు.. రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
డ్రైవర్ అప్రమత్తత – తప్పిన ముప్పు:
బస్సులో మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. బస్సు ఆగిన వెంటనే దట్టమైన పొగలు అలుముకోవడంతో, ప్రాణభయంతో ప్రయాణికులు అత్యవసరంగా కిటికీల గుండా బయటకు దూకేశారు. డ్రైవర్ సమయానికి బస్సును ఆపడం వల్లే ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగలిగారు.
ప్రయాణికులు సురక్షితం:
ఈ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పలువురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. కిటికీల నుంచి దూకడం వల్ల కొందరికి స్వల్ప గాయాలు అయినప్పటికీ, ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అధికారులు, ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
