Atchannaidu : జైల్లో వ్యక్తులను జగన్ అండ్ టీం సైలెంటుగా చంపేస్తారు.. చంద్రబాబు భద్రతపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

జైల్లో జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వ వైఖరితో తమలో ఆందోళన కలుగుతోందన్నారు. జైలుపై డ్రోన్లు ఎగరేస్తున్నా విచారణ లేదని అసహనం వ్యక్తం చేశారు.

Atchannaidu sensational comments

Atchannaidu Sensational Comments : రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు భద్రతపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో వ్యక్తులను చంపేయడంలో జగన్ అండ్ టీం ఎక్సపర్ట్స్ అని ఆరోపించారు. జైల్లో ఉన్న వాళ్లని సైలెంటుగా చంపేస్తారని పేర్కొన్నారు. గతంలో అలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు మీడియాతో చిట్ చాట్ చేశారు. జైల్లో జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వ వైఖరితో తమలో ఆందోళన కలుగుతోందన్నారు.

జైలుపై డ్రోన్లు ఎగరేస్తున్నా విచారణ లేదని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబును అంతం చేసేందుకు కోట్లాది రూపాయలు చేతులు మారాయనే లేఖలు వచ్చినా విచారణ జరపడం లేదని విమర్శించారు. జైలలు లోపల నుంచి ఫొటోలు వస్తున్నా ఎలాంటి చర్యల్లేవని వెల్లడించారు. చంద్రబాబు జుడిషియల్ కస్టడీలో ఉంటే ప్రభుత్వానికేం సంబంధమని ప్రశ్నించారు.

Chandrababu Letter : జైలులో భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాసిన చంద్రబాబు

సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లో మొత్తం వ్యవహరం నడుస్తుండడం కూడా తమకు మరింత ఆందోళన కలుగుతోందని తెలిపారు. గోరంట్ల మాధవ్ వంటి వారి మాటలతో ప్రభుత్వ ఉద్దేశ్యాలు బయట పడుతున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు చాలా వరకు బరువు తగ్గారని తెలిపారు. స్కిల్ సెంటర్లు లేవని గతంలో మంత్రులు కామెంట్లు చేశారని వెల్లడించారు. స్కిల్ సెంటర్లు ఉన్నాయని కేసు పెట్టిన అజయ్ రెడ్డి ఇప్పుడు స్వయంగా చెప్పారని తెలిపారు.

చంద్రబాబుపై స్కిల్ డెవలప్ మెంట్ కేసు బోగస్ : ధూళిపాళ్ల
చంద్రబాబుపై స్కిల్ డెవలప్ మెంట్ కేసు బోగస్ కేసు అని తేలిపోయిందని మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు. జగన్ ఆదేశాలతో పని చేసిన సీఐడీ చివరకు ఒక గాసిప్ ఏజెన్సీగా నిలిచిందని ఆరోపించారు. చివరకు దిక్కుతోచని స్థితిలో టీడీపీ సభ్యత్వం పొందడానికి కార్యకర్తలు చెల్లించే సొమ్ముని అవినీతిసొమ్ముగా చూపడానికి కిందామీదా పడుతోందని విమర్శించారు.

YSRTP : ఎన్నికల్లో వైఎస్ఆర్ టీపీకి బైనాక్యులర్ గుర్తు.. మరో గుర్తు కేటాయించాలని ఈసీకి విజ్ఞప్తి

కార్యకర్తలు, పార్టీ మధ్య జరిగే చెల్లింపుల వివరాలు ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ కంటాక్స్ విభాగానికి తెలియచేస్తూనే ఉంటుందని తెలిపారు. అధికారముందన్న అహంకారంతో నోరుపారేసుకుంటున్న మంత్రులు, వైసీపీ నేతల్ని ప్రజలు బట్టలు విప్పి పరుగులు పెట్టించే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.

ట్రెండింగ్ వార్తలు