Chandrababu Letter : జైలులో భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాసిన చంద్రబాబు

తన కదలికల కోసం జైలుపై అనధికారికంగా డ్రోన్లు ఎగరేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ఈ డ్రోన్లు ఎగరేశారని భావిస్తున్నానని ఆరోపించారు. డ్రోన్లు ఎగరేసిన ఘటనలోనూ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని చెప్పారు. 

Chandrababu Letter : జైలులో భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాసిన చంద్రబాబు

Chandrababu letter ACB court judge

Updated On : October 27, 2023 / 12:24 PM IST

Chandrababu Letter ACB Court Judge : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. జైలు అధికారుల ద్వారా ఆయన ఏసీబీ జడ్జికి లేఖ పంపారు. అక్టోబర్ 25వ తేదీన జడ్జికి చంద్రబాబు లేఖ రాశారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ మూడు పేజీల లేఖ రాశారు. తనకు జెడ్ ప్లస్ సెక్యూర్టీ ఉందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. తాను జైల్లోకి వచ్చినప్పుడు అనధికారికంగా తనను వీడియోలు, ఫొటోలు తీశారని వెల్లడించారు.

ఆ ఫుటేజ్ ను స్వయంగా పోలీసులే లీక్ చేశారని తెలిపారు. తన రెప్యూటేషన్ ను దెబ్బ తీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారని పేర్కొన్నారు. తనను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా వచ్చింది. కానీ, ఆ లేఖపై ఇప్పటి వరకు పోలీస్ అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదన్నారుు.

TTDP: తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోతే ప్రత్యామ్నాయమేంటి?

అక్టోబర్ 19న రిమాండ్ పొడిగింపు సందర్భంగా ఏసీబీ కోర్టులో లేఖలోని అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు. అయితే, రాతపూర్వకంగా ఈ అంశాలను లేఖ ద్వారా పంపించాలని చంద్రబాబును ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కోరారు. ఈ మేరకు ఆయన ఏసీబీ కోర్టు జడ్జికి  లేఖ రాశారు. ఎస్ కోటకి చెందిన ఓ ముద్దాయి జైల్లో పెన్ కెమెరాతో విజువల్స్ తీస్తున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు.

తన కదలికల కోసం జైలుపై అనధికారికంగా డ్రోన్లు ఎగరేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ఈ డ్రోన్లు ఎగరేశారని భావిస్తున్నానని ఆరోపించారు. డ్రోన్లు ఎగరేసిన ఘటనలోనూ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని చెప్పారు.  అక్టోబర్ 6వ తేదీన తనను కలవడానికి తన కుటుంబ సభ్యులు వచ్చిన సందర్భంలో రాజమండ్రి సెంట్రల్ జైలు మెయిన్ గేట్ వద్ద మరో డ్రోన్ ఎగరేశారని పేర్కొన్నారు.

Chandrababu : బెయిల్, ముందస్తు బెయిల్ కోసం.. ఏపీ హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు

తన భద్రతే కాదు.. తన కుటుంబ సభ్యులకు ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనతో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్ల కాలంలో తనపై వివిధ సందర్భాల్లో అధికారంలో ఉన్న వాళ్లు దాడులు చేశారని పేర్కొన్నారు. గంజాయి ప్యాకెట్లు జైలు ప్రాంగణంలో గార్డెనింగ్ చేస్తున్న ఖైదీల వద్దకు విసిరేస్తున్నారని వెల్లడించారు.