Attack on TDP leader: టీడీపీ కార్యకర్తపై.. రాళ్లు, రాడ్లతో మూకుమ్మడి దాడి..!
గుంటురూ జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు దగ్గర.. దారుణం జరిగింది. టీడీపీ కార్యకర్త షేక్ సైదాపై.. ప్రత్యర్థులు కిరాతకంగా దాడి చేశారు. కాళ్లు, చేతులు పగలగొట్టారు.
- Ravikanth 10tv
- Updated on- November 24, 2021 / 03:31 PM IST
Attack
Attack on TDP leader: గుంటురూ జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు దగ్గర.. దారుణం జరిగింది. టీడీపీ కార్యకర్త షేక్ సైదాపై.. ప్రత్యర్థులు కిరాతకంగా దాడి చేశారు. కాళ్లు, చేతులు పగలగొట్టారు. వద్దూ.. వద్దని వేడుకుంటున్నా.. ఒక్కడిని చేసి ఏకంగా నలుగురైదుగురు దాడి చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పిడుగురాళ్ల శివారులోని హైవేపైన ఈ దారుణం జరిగింది. సైదా కాళ్లపై.. జాకీలు, ఇనుపరాడ్లు, బండలతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. చివరికి వారి బారి నుంచి బయటపడిన సైదా.. నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. పొలం వివాదం సాకుతోనే తనపై ఇంతగా దాడికి తెగబడ్డారని ఆయన ఆరోపించారు.
శివారెడ్డి, హేమంత్ రెడ్డి, పున్నారెడ్డి, ప్రతాపరెడ్డి, అయ్యప్పరెడ్డితో పాటు.. నరసరావుపేటకు చెందిన మరో నలుగురు దాడి చేశారని సైదాతో పాటు, అతని భార్య ఇమాం బీ.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం షేక్ సైదా.. చికిత్స పొందుతున్నారు. దాడి చేసిన వాళ్లు వైసీపీ నాయకులే అని ఆరోపించారు.
మరోవైపు.. ఇంత జరుగుతున్నా.. ఆ దారిన పోతున్నవాళ్లు చూస్తూ ఉన్నారే తప్ప.. దాడిని ఆపేందుకు ధైర్యం చేయలేకపోయారు. బండరాళ్లు, ఇనుపరాడ్లతో జరిగిన దాడిని చూసి భయంతో వణికిపోయారు.
