పదో తరగతి విద్యార్థిపై ఆటో డ్రైవర్ వేధింపులు… యువకుడిని చితకబాదిన బాలిక తల్లి

పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ కు దేహశుద్ధి చేశారు. అమ్మాయిని వేధిస్తుండటంతో ఆమె తల్లి ఆ యువకుడికి దేహశుద్ధి చేసింది.

  • Publish Date - March 17, 2020 / 08:34 AM IST

పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ కు దేహశుద్ధి చేశారు. అమ్మాయిని వేధిస్తుండటంతో ఆమె తల్లి ఆ యువకుడికి దేహశుద్ధి చేసింది.

పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ కు దేహశుద్ధి చేశారు. అమ్మాయిని వేధిస్తుండటంతో ఆమె తల్లి ఆ యువకుడికి దేహశుద్ధి చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. భీమవరం సమీపంలోని పాలకోడేరు మండలం విస్సా కోడేరులోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని పదో తరగతి చదువుతోంది.

పేరుపాలెంకు చెందిన ఆటోడ్రైవర్ నెల రోజులకు పైగా బాలికను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆటోలో వెళ్తున్నప్పుడు ఒంటిపై చేతులు వేయడం, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. 

అతని వేధింపులు శృతిమించిపోవడంతో తట్టుకోలేని బాలిక చివరికి తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు చాకచక్యంగా వెళ్లి ఆటో డ్రైవర్ ను పట్టుకున్నారు. బాలిక తల్లితోపాటు కుటుంబ సభ్యులందరూ కలిసి అతన్ని చితకబాదారు.

అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులను వేధిస్తున్నాడని సదరు బాలిక తెలపడంతో ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది. 

Also Read | కాపర్ వాడితే కరోనా దూరం…నిమిషాల్లోనే వైరస్ చనిపోతుందట!