Vijayawada Crime: విజయవాడలో బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం
స్నేహితుడిని కలిసేందుకు వచ్చిన ఓ ఒంటరి బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి యత్నించిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది
- Bharath Reddy
- Published On : May 2, 2022 / 08:45 AM IST
Crime
Vijayawada Crime: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై వరుస అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గుంటూరు రమ్య ఘటనలో నిందితుడికి కోర్టు ఉరి శిక్ష విధించినా..అత్యాచారాలకు పాల్పడే వారిలో భయం కలగడంలేదు. రేపల్లె రైల్వేస్టేషన్ లో భర్తను కొట్టి భార్యపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన మరువకముందే విజయవాడలో మరో ఘటన చోటుచేసుకుంది. స్నేహితుడిని కలిసేందుకు వచ్చిన ఓ ఒంటరి బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి యత్నించిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. నూజివీడు మండలానికి చెందిన బాలిక స్థానికంగా ఇంటర్ చదువుతుంది. ఫేస్‌బుక్‌లో బెంగళూరుకి చెందిన ఆంజనేయులు అనే యువకుడితో పరిచయం పెంచుకుంది.
Also Read:Repalle: రేపల్లె ఘటన బాధితురాలికి నేడు హోం మంత్రి తానేటి వనిత పరామర్శ
ఈక్రమంలో ఆంజనేయులుని కలిసేందుకు విజయవాడ చేరుకుంది బాలిక. నగరంలో ఓ హోటల్‌లో ఉన్న ఆంజనేయులుని కలిసేందుకు బాలిక ఆటో ఎక్కింది. అయితే ఆటో డ్రైవర్ బాలికను నున్న వైపు తీసుకెళ్లి అక్కడి పొలాల్లో బాలికపై అత్యచారానికి యత్నించాడు. బాలిక గట్టిగ కేకలు వేయడంతో ఆటో డ్రైవర్ పరారయ్యాడు. స్థానికుల సహాయంతో అక్కడి నుంచి బయటపడ్డ బాలిక కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఘటనపై అప్రమత్తమైన పోలీసులు సీసీఫుటేజీల ఆధారంగా ఆటో..సింగ్ నగర్ ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు. నిందితుడికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు.
Also read:Food poision : షవర్మా తిని ఒకరు మృతి.. 18 మంది ఆసుపత్రిలో..
